Divorce: చై – సామ్ కి అధికారకంగా విడాకులు వచ్చేది ఎప్పుడో తెలుసా?

Divorce: అక్కినేని నాగ చైతన్య , సమంత టాలీవుడ్ లోనే బెస్ట్ కపుల్ . ఎన్నో సంవత్సరాలు ప్రేమించుకుని ఒకరినొకరు అర్థం చేసుకున్న తర్వాత పెద్దల అంగీకారంతో అందరి సమక్షంలో వారు వివాహబంధంతో ఒక్కటయ్యారు . పెళ్లి తర్వాత చాలా కాలం వరకు ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట కొన్ని అనూహ్య కారణాలవల్ల ఒకరికొకరు దూరంగా ఉండవలసి వచ్చింది. తమ వ్యక్తిగత కారణాల వల్ల వారిరువురు విడాకులు తీసుకుంటున్నట్టు అధికారికంగా వెల్లడించారు. అయితే ఇప్పటికీ వారికి విడాకులు వచ్చాయా లేదా అన్న అనుమానం అందరిలో కలుగుతోంది. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట ఇలా విడిపోవటం వల్ల అభిమానులు ఎంతగానో దిగ్భ్రాంతికి గురయ్యారు.

వారు ఇద్దరు విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించిన తర్వాత ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు . అయితే వారిద్దరూ మళ్లీ పెళ్లి చేసుకోవాలి అంటే కచ్చితంగా విడాకులు తీసుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి వారికైనా కోర్టులో విడాకులకు దరఖాస్తు చేసుకున్న కొన్ని నెలల తర్వాత వారికి కోర్టు విడాకులు మంజూరు చేస్తుంది. సెలబ్రెటీలకు , సామాన్యులకు అందరికీ ఒకే విధంగా న్యాయం ఉంటుంది. అయితే సమంత , నాగ చైతన్య ఇద్దరు విడిపోవాలి అనుకున్నప్పుడు ఇప్పటికే ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకొని ఉంటారు. కోర్టు నిర్ణయించిన తేదీన వారిద్దరూ విడాకుల కోసం కోర్టుకు హాజరవ్వాల్సి ఉంటుంది.

సమంత నాగచైతన్య విడిపోతున్నట్టు వారు ప్రకటించినప్పటికీ.. అధికారికంగా వారికి విడాకులు వస్తేనే వారు విడిపోయినట్టు. అయితే వారిద్దరూ ఇప్పటివరకు విడాకుల కోసం ఒక్కసారి కూడా కోర్టుకు వెళ్లిన ఆధారాలు లేవు. అందువల్ల ఇప్పటివరకు వారిరువురికి విడాకులు మంజూరు కాలేదన్న విషయం అందరికీ తెలిసిపోతోంది. అయితే అందరిలో ఇంకొక అనుమానం కూడా కలుగుతోంది.. కరోనా కేసులు పెరుగుతుండటం వల్ల కోర్టు వారిరువురికి ఆన్ లైన్ ద్వారా విడాకులు మంజూరు చేసిందేమో అన్న సందేహం అందరికీ ఉంది. ఇప్పటివరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో సమంత , నాగ చైతన్య విడాకుల విషయం హాట్ టాపిక్ గానే నిలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ వీరిద్దరూ మళ్లీ కలిస్తే బాగుంటుందని అభిమానులు ఎంతగానో ఆశిస్తున్నారు.