సాధారణంగా ఏదైనా జబ్బు చేసినప్పుడు డాక్టర్ సలహా మేరకు టాబ్లెట్లు వాడుతుంటారు. అయితే డాక్టర్లు ఇచ్చిన మందులు సమయానికి వేసుకోవడం తప్ప వాటి గురించి పూర్తి సమాచారం మనకు తెలియదు. టాబ్లెట్లు ఇచ్చారా..వేసుకున్నామ.. జబ్బు తగ్గిపోయిందా.. అన్నంత వరకు మాత్రమే ఆలోచిస్తారు. అసలు ఆ టాబ్లెట్లు ఏ కంపెనీకి చెందినది ఎప్పుడు తయారు చేశారు ఎక్స్పైరీ డేట్ ఎంతవరకు ఉంటుంది అన్న విషయాల గురించి తెలుసుకోవటానికి ఎక్కువ ఎవరు ఆసక్తి చూపరు. మరికొంతమంది ఏదైనా జబ్బు చేసినప్పుడు డాక్టర్ సలహా లేకుండానే మెడికల్ షాప్ లో టాబ్లెట్లు తీసుకుని వేసుకుంటారు. అయితే ఎలా టాబ్లెట్ల గురించి అవగాహన లేకుండా వాటిని వాడటం వల్ల కొన్ని సందర్భాలలో వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి.
అందువల్ల టాబ్లెట్ల గురించి కొంచెం సమాచారాన్ని తెలుసుకోవటం చాలా అవసరం. ఇదిలా ఉండగా టాబ్లెట్ల వెనుక భాగంలో ఎరుపు, రంగు నీలిరంగులతో గుర్తులు ఉంటాయి. అయితే ఈ గుర్తులు ఎందుకు ఉంచారు అన్న విషయం గురించి ఎవరికీ అవగాహన ఉండదు. అసలు టాబ్లెట్ షీట్ వెనుక భాగంలో ఎరుపు రంగు నీలిరంగు తో కొన్ని రకాల గీతలు ఎందుకు ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఎరుపు రంగు గీతలు : సాధారణంగా కొన్ని టాబ్లెట్స్ వెనుక భాగంలో మనం మెరుపు రంగు గీతలను గుర్తించవచ్చు. ఈ ఎరుపు రంగు గీతలను కేవలం ఆంటీబయాటిక్ టాబ్లెట్స్ మీద మాత్రమే వేస్తారు. ఎందుకంటే ఎరుపు రంగు ప్రమాదానికి సూచిక. ఈ ఆంటీబయాటిక్ టాబ్లెట్స్ ఎక్కువగా వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. అందుకోసమే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేనిదే వీటిని మందుల షాప్ వాళ్ళు కూడా ఇవ్వరు. అంతేకాకుండా ఈ టాబ్లెట్స్ మీద Rx అని రాసి ఉంటుంది. అందువల్ల ఎరుపు రంగు గీతలు ఉన్న టాబ్లెట్స్ ఎక్కువగా ఉపయోగించరాదు.
నీలి రంగు గీతలు : నీలి రంగు గీతలు కలిగి ఉన్న టాబ్లెట్ ఉపయోగించటం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. పారాసిటమాల్, డోలో వంటి ఇతర టాబ్లెట్స్ మీద నీలిరంగు గీతలు ఉంటాయి. ఈ మందులు ఎక్కువగా వాడటం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అందువల్ల వీటిని డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకపోయినా మందుల షాప్ లో తీసుకోవచ్చు. అంతే కాకుండా మనం వేసే వాడే ప్రతి ఒక్క టాబ్లెట్ మీద ఆ టాబ్లెట్ ఏ ఫార్మా కంపెనీ వాళ్ళు తయారు చేస్తున్నారు. అవి ఎప్పుడు తయారు చేశారు. ఆ టాబ్లెట్ లకు ఎక్స్పైరీ ఎప్పుడు అన్న విషయాల గురించి పూర్తి సమాచారం టాబ్లెట్ వెనుక భాగంలో ఉంటుంది.