Dj Tillu Heroine : మీడియా చెత్త ప్రశ్నతో హర్టయిన హీరోయిన్! క్షమాపణ చెప్పిన భీమ్లా నిర్మాత!

Dj Tillu Heroine : ఇప్పుడు మళ్ళీ టాలీవుడ్ నుంచి సినిమాలు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో కొన్నిటికి మాత్రమే మంచి క్రేజ్ దక్కుతుంది. అలా లేటెస్ట్ గా అయితే మంచి బజ్ ని సెట్ చేసుకున్న లేటెస్ట్ సినిమా ఏదన్నా ఉంది అంటే అది యంగ్ అండ్ టాలెంటడ్ హీరో హీరోయిన్స్ సిద్ధు జొన్నలగడ్డ మరియు “మెహబూబా” ఫేమ్ నేహా శెట్టి లు నటించిన చిత్రం “డీజే టిల్లు” అని చెప్పాలి.

మరి ఈ సినిమా నుంచి నిన్ననే మాస్ ట్రైలర్ ని కూడా రిలీజ్ చెయ్యగా దానికి భారీ రెస్పాన్స్ కూడా వస్తుంది. అయితే ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలోనే ఈ యంగ్ హీరోయిన్ కి చేదు అనుభవం ఎదురైంది. ఓ మీడియా ప్రముఖుడు అడిగిన ప్రశ్న నిజంగానే అంత చెత్తగానే ఉందని చెప్పాలి. హీరోయిన్ పుట్టుమచ్చల కోసం అడగడం స్టేజ్ పై అందరికీ షాక్ ఇవ్వగా హీరో ఆ ప్రశ్నకి సమాధానం చెప్పానని స్కిప్ చేసేసాడు.

తర్వాత ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ కాగా నేహా శెట్టి ట్రైలర్ లాంచ్ లో ఆ సందర్భంగా నాకు అసలు నచ్చలేదని, అయితే అతను ఒకటి ఆలోచించుకోవాలి అతనికి అతని పట్ల కానీ చుట్టూ పక్కల ఉండే విమెన్ ఫోర్స్, వారి ఇంట్లో ఉండే ఆడవాళ్లపై ఎంత వరకు గౌరవం ఉంది అనేది అంటూ అసహనం వ్యక్తం చేసింది.

మరి దీనితో ఈ సినిమాకి మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ కి నిర్మాత అయ్యిన నాగ వంశీ స్పందిస్తూ ఇది అనుకోకుండా జరిగింది అని మమ్మల్ని క్షమించమని ఆమెని తాను కోరారు. దీనితో ఈ వీడియో మరియు రిప్లై లు మరింత వైరల్ అవుతున్నాయి. ఈ రకంగా ఉన్నాయి మనవాళ్ల మీడియా విలువలు.