సినీ ఇండస్ట్రీకి చెందిన నటి దివ్య వాణి గత కొన్ని రోజుల నుంచి వార్తల్లో బాగా హాట్ టాపిక్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవలే ఈమె తెలుగుదేశం పార్టీకి కూడా రాజీనామా చేశారు. ఇదిలా ఉంటే తాజాగా తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న విషయాల గురించి మాట్లాడారు.
తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న విషయాలన్నీ త్వరలో బయట పెడతానంటూ.. ఇప్పటికీ ఆ పార్టీ లో ఎంతోమంది మహిళలు ఇబ్బంది పడుతున్నారు అని.. ఆ పార్టీ విశ్లేషకుల పేరుతో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు అని అన్నారు. ఆ పార్టీలో ఉన్నంతకాలం తనకు పని చేసే స్వేచ్ఛ లేదు అని.. ఇన్నాళ్లు ఏం జరిగిందో అన్నింటికీ ఆధారాలు ఉన్నాయని.. తను చెప్పే నిజాలను చూపించే ధైర్యం ఏబీఎన్, టీవీ ఫైవ్ కి ఉందా అని ప్రశ్నించారు.