బిగ్ పైత్యం: ఈ అడ్డదిడ్డమైన జ్యూస్‌ల గోలేంట్రా బాబూ.!

బిగ్‌బాస్ షో అంటేనే అదో పెద్ద రోతలా తయారైంది పరిస్థితి. అసలే ఈ సీజన్ మొదట్నుంచీ చప్ప చప్పగా సాగుతోందంటే, తాజా ఎపిసోడ్స్‌లో కెప్టెన్సీ టాస్క్ పేరు చెప్పి అడ్డమైన జ్యూస్‌లు తాగిస్తున్నారు కంటెస్టెంట్స్‌తో. వాళ్లెలా తాగుతున్నారో కానీ, చూసే ప్రేక్షకులకు నిజంగానే వాంతులు చేసుకుంటున్నారు.

గత సీజన్లోనూ ఇలాంటి టాస్కులున్నాయి. కానీ, మరీ ఇంత పైత్యం చూపించలేదు. ఆ అడ్డదిడ్డమైన జ్యూస్‌లు తాగిన కంటెస్టెంట్స్ పరిస్థితేంటా.? అనే సానుభూతి కన్నా, పైత్యం మరీ ఎక్కువైందబ్బా.. అనే నిట్టూర్పులు, అసహనాలే ఎక్కువైపోయాయ్ బిగ్‌బాస్ వ్యూయర్స్‌కి.

పేడ నీళ్లతో స్నానాలు, పచ్చి గుడ్డు, పెయింట్ జ్యూస్‌లు.. అబ్బబ్బా.. ఇలాంటివి ఒక్కటేమిటీ.. ఛస్తున్నాంరా బాబూ ఈ పైత్యం చూడలేక.. అంటూ ఛానెల్ స్కిప్ చేసేస్తున్నారంటే అతిశయోక్తి కాదేమో. నిజమే, బిగ్‌బాస్ షో కున్న క్రేజే వేరు. కానీ, ఈ సీజన్ షో మాత్రం ఎంత కాంప్రమైజ్ కావాలన్నా కానివ్వడం లేదే. ఇలా అయితే ఎలా బిగ్‌బాస్.

సగానికి పైగా ఎపిసోడ్స్ అయిపోయాయ్. ఇప్పటికైనా బిగ్‌బాస్‌పై ఒకింత స్పెషల్ ఇంట్రెస్ట్ క్రియేట్ కావాలంటే, బిగ్‌బాస్ తన పంథా మార్చాలి. ఇంట్రెస్టింగ్ ఫిజికల్ టాస్కులపై బిగ్‌బాస్ దృష్టి పెట్టాల్సిన అవసరముంది. తప్పదు.