Director Kalyan Krishna: అక్కినేని నాగార్జున, తనయుడు నాగచైతన్య మల్టీస్టారర్ లుగా నటించిన తాజా చిత్రం బంగార్రాజు. ఇక ఈ సినిమా ఈవెంట్ లో భాగంగా నాగ చైతన్య, నటి దక్ష ల వీడియో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇక ఈవెంట్లో భాగంగా స్టేజ్ పై నాగార్జున మాట్లాడుతుంటే నాగ చైతన్య, హీరోయిన్ దక్షిణం వైపు చూడగా, అప్పుడు ఆమె కనుబొమ్మలు ఎగిరేయడం తో చైతన్య సిగ్గుపడిపోయాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోని చూసి నన్ను రెండు రకాలుగా స్పందిస్తున్నారు.
దీనితో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇకపోతే బంగార్రాజు సినిమా విషయానికి వస్తే ఈ సినిమా ఇటీవలే విడుదలై మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక ఈ మూవీ మంచి విజయం సాధించిన సందర్భంగా చిత్ర బృందం సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఈ సక్సెస్ మీట్ లో దర్శకుడు కళ్యాణ్ కృష్ణ మాట్లాడుతూ.. చైతన్య దక్ష ల వీడియో పై స్పందించాడు. ఈ క్రమంలోనే మొదట నాగచైతన్య గురించి మాట్లాడుతూ నాగచైతన్య స్వభావం ఎలాంటిది, నాగచైతన్య సెట్ లో ఏవిధంగా ఉండేవాడు అన్న విషయంపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అయితే ఈ వీడియోకి కారణం అంతా కూడా దక్ష నే అంటూ హీరోయిన్ వైపు చూస్తూ చెప్పాడు కళ్యాణ్ కృష్ణ. చైతన్య కు చాలా సిగ్గు, మొహమాటస్తుడు.. చైతన్య కు ఎంత సిగ్గు అంటే దానికి ఉదాహరణ ఇటీవల అని చెప్పవచ్చు. నాగార్జున సార్ మాట్లాడుతుంటే ఏదో సౌండ్ వినిపించడం తో వెనక్కి తిరిగాడు.. అప్పుడు దక్ష అతడి వైపు చూసి కళ్ళు ఎగరేసింది.. దానికి చైతన్య సిగ్గుపడ్డాడు.. ఆయన స్వభావమే అంత దేనికైనా సిగ్గు పడుతూ ఉంటాడు అని చెప్పుకొచ్చాడు కళ్యాణ్ కృష్ణ. ఈ వీడియోలో చైతన్య ఏం లేదు.. అంతా నువ్వే చేసావు అంటూ హీరోయిన్ వైపు చూస్తూ అన్నాడు..