రామ్ చరణ్ సినిమాపై బిగ్ అప్డేట్ ఇచ్చిన దర్శకుడు శంకర్..!

Ram Charan Shankar

ప్రస్తుతం మన ఇండియన్ సినిమా పేరు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువగా వినిపిస్తూ ఉండొచ్చు కానీ తనదైన సినిమాలతో దర్శకుడు శంకర్ భారతదేశ సినిమాని ఎప్పుడో ప్రపంచ స్థాయిలో నిలబెట్టారు. ప్రతి సినిమాని కూడా ఒక అద్భుతంలా తెరకెక్కించి అలరించారు.

అయితే శంకర్ కూడా ఇప్పుడు ప్లాప్స్ లో ఉండడంతో ఇండియన్ సినిమా దగ్గర మాత్రం తన మార్క్ కం బ్యాక్ ఇవ్వాలని అయితే అంతా ఆశిస్తున్నారు. అయితే తాను టేకప్ చేసిన కొత్త ప్రాజెక్ట్స్ లో అయితే రీమేక్, సీక్వెల్స్ కాకుండా ఉన్న సినిమా మాత్రం మన టాలీవుడ్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో సెట్ చేసిన RC 15 సినిమానే అని చెప్పాలి.

ఈ సినిమాపై భారీ స్థాయి అంచనాలు పాన్ ఇండియా లెవెల్లో ఉన్నాయి. మెయిన్ గా తెలుగు హిందీ తమిళ్ భాషల్లో ప్లాన్ చేస్తున్న ఈ సినిమాపై అయితే తాజాగా దర్శకుడు శంకర్ ఇచ్చిన సెన్సేషనల్ క్లారిటీ హాట్ టాపిక్ గా మారింది. శంకర్ ఈ సినిమా అలాగే కమల్ హాసన్ తో చిత్రం ఇండియన్ 2 ని కూడా ఒకే సమయంలో చేయాలనీ అనుకుంటున్నానని..

అలాగే రామ్ చరణ్ సినిమా కొత్త షెడ్యూల్ అయితే ఈ సెప్టెంబర్ మొదటి వారం లో చేస్తున్నానని ఈ షూట్ హైదరాబాద్ మరియు వైజాగ్ లో ఉంటుంది అని మెయిన్ అప్డేట్ ఇచ్చారు. దీనితో ఈ సినిమాపై వస్తున్న గాసిప్స్ కి తాను ఓ సమాధానం ఇచ్చినట్టు చేసారని సినీ వర్గాల వారు అంటున్నారు.