Shekar Kammula: హైబ్రిడ్ పిల్లని పక్కన పెట్టిన ఫిదా డైరెక్టర్..!

Shekar Kammula: శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వచ్చిన ఫిదా, లవ్ స్టోరీ సినిమాలు సూపర్ డూపర్ హిట్ సాధించాయి . టాలీవుడ్ ఇండస్ట్రీలో లవ్ స్టోరీస్ తో సినిమాలు తీసే శేఖర్ కమ్ముల తనకంటూ ఒక గుర్తింపు ఏర్పరచుకున్నాడు . ఆనంద్ , గోదావరి , లీడర్ , హ్యాపీ డేస్ చిత్రాలకు శేఖర్ కమల నంది అవార్డు అందుకున్నారు . దాదాపు శేఖర్ కమ్ముల తీసిన సినిమాలు అన్ని మంచి విజయాన్ని సాధించాయి. హిట్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా , లవ్ స్టోరీ సినిమాలలో హీరోయిన్ పాత్రలో సాయి పల్లవి నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది . అయితే ఇప్పుడు శేఖర్ కమ్ముల నిర్మించబోతున్న చిత్రంలో హీరోయిన్ పాత్రలో సాయి పల్లవిని కాకుండా వేరే వారిని ఎనుకున్నట్టు సినీ వర్గాలలో వినికిడి.

తెలుగు , తమిళం , మలయాళం భాషలలో నటించి తన నటనతో అందరిని మెప్పించిన సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు . తాజాగా సాయి పల్లవి నటించటం శ్యామ్ సింగరాయ్ మూవీ విడుదలై మంచి విజయాన్ని సాధించింది . సాయి పల్లవికి మంచి నటిగా మాత్రమే కాకుండా డాన్సర్ గా కూడా మంచి గుర్తింపు ఉంది . అయితే ఈ హీరోయిన్ వరుసగా శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వచ్చిన ఫిదా , లవ్ స్టోరీ సినిమాలలో నటించి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది .

అయితే తాజాగా శేఖర్ కమ్ముల శ్రీ వెంకటేశ్వరా సినిమాస్ ఎల్. ఎల్. పి బ్యానర్ లో తమిళ్ హీరో ధనుష్ హీరోగా ఒక చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నారు . రెండు వరుస హిట్ సినిమాలలో నటించిన సాయి పల్లవి నీ పక్కన పెట్టి ఈ సినిమాలో హీరోయిన్ పాత్రలో బాలీవుడ్ బ్యూటీని హీరోయిన్ గా ఎంపిక చేయబోతున్నారట .ఈ క్రమంలోనే ఎంతోమంది ఈ విషయంపై స్పందిస్తూ శేఖర్ కమ్ముల కు సాయి పల్లవి బోర్ కొట్టిందా అందుకే బాలీవుడ్ హీరోయిన్ గా అవకాశం ఇచ్చారా అంటూ కామెంట్లు చేస్తున్నారు. శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేయబోయే ఈ చిత్రం యాక్షన్ త్రిల్లర్ మూవీగా తెరకెక్కిస్తున్నారు .