Rajasekhar: సింహరాశి కథను అర్జున్ కి చెబితే చేయనన్నాడు… చివరికి రాజశేఖర్ ను కలిస్తే ఎలా మాట్లాడారంటే.. డైరెక్టర్ సముద్ర!

Rajasekhar: తాను సూపర్ గుడ్ ఫిల్మ్స్ లో సబ్జెక్ట్ చెప్పి, ఓకే చెప్పించుకొని ఆ కథను పట్టుకొని తిరుగుతున్నప్పుడు, డైరెక్షన్ ఛాన్స్ కోసం తిరుగుతున్న సమయంలో ఆర్. బీ. చౌదరి గారు తనను తమిళ విజయ్ కాంత్ గారికి, హీరో విజయ్ కి, అర్జున్ కి వీళ్ళందరికీ చెప్పిస్తూ, ఫైనల్ గా రాజశేఖర్ గారి దగ్గరికి పంపారని డైరెక్టర్ సముద్ర చెప్పారు. ఐతే ఆయన ఫిల్మ్ సిటీలో అప్పుడు మెకానిక్ మామయ్య అనే సినిమా షూట్ చేస్తున్నారని సముద్ర తెలిపారు.

అప్పుడు తాను అక్కడికి వెళ్లి, ఆయనకు కదా చెప్పిన తర్వాత, నేను చౌదరి గారితో మాట్లాడుతాను, మీరు వెళ్ళండి అని రాజశేఖర్ తనతో అన్నట్టు ఆయన తెలిపారు. అప్పుడు ఆయన చౌదరి గారికి కాల్ చేసి తాను ఆయనకు బావ నచ్చానని,స్టోరీ కూడా బాగా నరెట్ చేశారని చెప్పినట్టు సముద్ర అన్నారు. సబ్జెక్ట్ చాలా హెవీ గా ఉంది. ఎంత వరకు అనేది జడ్జ్ చేసుకోలేక పోయాను. అందరూ రీమేక్ లు చేస్తున్నారు. నాక్కూడా ఏదైనా రీమేక్ చేయండి అని రాజశేఖర్ చౌదరి గారిని అడిగినట్టు ఆయన చెప్పారు.

ఐతే తాను అప్పటికే నరసింహ నాయుడు సినిమాకి అసోసియేట్ డైరెక్టర్ గా పని చేస్తున్నానని సముద్ర అన్నారు. మాయి అని ఒక తమిళ్ మూవీని రాజశేఖర్ మి సజెస్ట్ చేశాడని ఆయన తెలిపారు. ఈ సినిమా చూడు, ఇద్దరు డైరెక్టర్స్ ఉన్నారు, ఒకరు నిన్నే ప్రేమిస్తా డైరెక్టర్ షిండే, కొత్త డైరెక్టర్ సముద్ర అని, వీళ్ళద్దర్లో ఎవరో చూస్ చేసుకోమని అడిగితే, అప్పుడు తనకు సముద్ర కథ బాగా చెప్పాడు కాబట్టి సముద్రనే పెట్టుకుందాం అని రాజశేఖర్ అనడంతో తనకు ఫస్ట్ సినిమా కన్ఫర్మ్ అయిందని ఆయన వివరించారు. ఐతే రాజశేఖర్ గారి విషయంలో అప్పటికే కొన్ని సంఘటనలు జరగడంతో, ఎలా అవుతుందో అని టెన్షన్ పడ్డట్టు ఆయన తెలిపారు.

ఏదేమైనా పర్లేదు అనుకొని, తనకు రాజశేఖర్ గారి వాళ్లే చౌదరి గారి ద్వారా ఛాన్స్ వచ్చిందని ఆయన చెప్పారు. రాజశేఖర్ గానీ, జీవిత గానీ చ తెలివి గల వారు అని, వాళ్ళ సహకారంతోనే ఫస్ట్ సినిమా ఐనా తొందరగా పూర్తి చేయడం జరిగిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.