Vijay Sethupathi: విజయ్ సేతుపతి.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తమిళంతో తెలుగులో కూడా పలు సినిమాలు నటించి నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు విజయ్ సేతుపతి. కేవలం సినిమాలకు సంబంధించిన విషయాలలో మాత్రమే వార్తల్లో నిలుస్తూ ఉంటారు. కాంట్రవర్సీలకు చాలా దూరంగా ఉంటారు విజయ్ సేతుపతి. ప్రస్తుతం తమిళం తో పాటు తెలుగులో కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు.
వివాదాలకు దూరంగా ఉంటూ తన పని తాను చేసుకుంటూ వెళుతూ ఉంటారు. అందుకే ఇండస్ట్రీలో అందరూ ఆయనను అజాత శత్రువు అని పిలుస్తూ ఉంటారు. కానీ విజయ్ అంటే గిట్టని వ్యక్తి ఒకరు ఉన్నారు. ఆయనే జాతీయ అవార్డు గ్రహిత, డైరెక్టర్ పాండిరాజ్. గతంలో వీరిద్దరి మధ్య కొన్ని అభిప్రాయ బేధాలు వచ్చాయట. ఒక సినిమా విషయంలో ఇద్దరు గొడవపడ్డారట. దీంతో జీవితంలో ఇక విజయ్ తో సినిమా చేయవద్దని పాండిరాజ్ భావించారట. కానీ స్వయంగా విజయ్ సేతుపతే వచ్చి అడగడంతో సినిమా చేశానని తెలిపారు.కాగా పాండిరాజ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి, నిత్యామీనన్ మీనన్ జంటగా నటించిన తాజా చిత్రం తలైవన్ తలైవి.
జులై 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా నిర్వహించిన ఈ సినిమా ఈవెంట్‌లో పాండిరాజ్ మాట్లాడుతూ.. గతంలో విజయ్ తో జరిగిన గొడవ గురించి మాట్లాడుతూ.. విజయ్‌కి, నాకు గతంలో బేదాభిప్రాయాలు వచ్చిన విషయం నిజమే. జీవితంలో ఆయనతో సినిమా చేయకూడదుని నిర్ణయించుకున్నాను. కానీ ఒకసారి దర్శకుడు మిష్కిన్ బర్త్‌డే ఈవెంట్ లో మళ్లీ మేమిద్దరం కలిశాము. అప్పుడు విజయే స్వయంగా వచ్చి మనం ఇద్దరం కలిసి ఒక సినిమా చేద్దామా అని అడిగాడు. దాంతో అప్పటి వరకు మా ఇద్దరి మధ్య ఉన్న దూరం తొలగిపోయి కొత్త ప్రయాణానికి బీజం పడింది. మిష్కిన్ బర్త్‌డే పార్టీ తర్వాత తలైవన్ తలైవి స్క్రిప్ట్ సిద్ధం చేశాను. కథ పూర్తయిన తర్వాత విజయ్ కి 20 నిమిషాల పాటు స్టోరీ నెరేట్ చేయగానే ఆయన ఒప్పుకున్నారు అని పాండిరాజ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు చేసిన మీడియాలో వైరల్ గా మారాయి.
Vijay Sethupathi: విజయ్ సేతుపతితో జీవితంలో కలిసి పనిచేయకూడదనుకున్నాను.. సంచలన వాఖ్యలు చేసిన పాండిరాజ్!
