గాడ్ ఫాదర్ గురించి  ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించిన డైరెక్టర్ మోహన్ రాజా

అప్పుడెప్పుడో ‘హనుమాన్ జంక్షన్’ లాంటి సూపర్ హిట్ అందించిన డైరెక్టర్ మోహన్ రాజా ఆ తర్వాత కేవలం తమిళ్ కే పరిమతమయ్యాడు. తన తమ్ముడు జయం రవి తో సినిమాలు చేస్తూ బిజీ గా ఉన్నాడు. చాలా గ్యాప్ తర్వాత తెలుగు లో మరోసారి చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ కి డైరెక్ట్ చేస్తున్నాడు. రీమేక్ లు తియ్యడం లో దిట్ట అయిన మోహన్ రాజా ఇప్పుడు ‘లూసిఫర్’ ని తెలుగు లో ‘గాడ్ ఫాదర్’ గా రీమేక్ చేసాడు. రేపు రిలీజ్ కాబోతున్న ఈ మూవీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించాడు మోహన్ రాజా.

ఆయన మాట్లాడుతూ ఒరిజినల్ లూసిఫర్ వర్షన్ ని మన తెలుగు ఆడియన్స్ కి నచ్చే విధంగా ఒకింత కొద్దిపాటి మార్పులు చేయడం జరిగిందని, అలానే ఈ మూవీకి తాను ఫ్రెష్ గా స్క్రీన్ ప్లే రాశానని అన్నారు. అలాగే మలయాళం లో మోహన్ లాల్ కేవలం 50  నిముషాలు మాత్రమే స్క్రీన్ పై కనపడతాడని కానీ తెలుగు లో చిరంజీవి మాత్రం రెండు గంటలు పైనే స్క్రీన్ మీద కనపడతాడని అన్నాడు.

తెలుగు లో  మెగాస్టార్ చిరంజీవి గారితో పాటు మరొ పది పాత్రలు గెలుస్థాయి అని, అవి ఒరిజినల్ వెర్షన్ లూసీఫర్ లో చూడలేదు అని, చాలా ఆసక్తికరంగా ఉంటాయి అని అన్నారు. డైరెక్టర్ మోహన్ రాజా చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.