మెగా లీక్ ని కన్ఫర్మ్ చేసేసిన దర్శకుడు..ఫ్యాన్స్ కి ఇక పూనకాలే.!

Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా “ఆచార్య” ఎన్నో అంచనాలు నడుమ విడుదల అయ్యి ఊహించని రేంజ్ ప్లాప్ గా నిలిచిపోయింది. ఈ సినిమా ఎఫెక్ట్ ఒక్క చిరు కెరీర్ లోనే కాకుండా ఈ సినిమాలో నటించినందుకు చరణ్ కెరీర్ కి కూడా బాగా దెబ్బ పడేలా చేసింది.

అయితే ఈ సినిమా ఫలితానికి సమాధానంగా నెక్స్ట్ సినిమాలతో అయినా మెగాస్టార్ తన పవర్ చూపించాలని ఆ సినిమాల కోసం మెగా ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ క్రేజీ లైనప్ లో మెగాస్టార్ 154వ సినిమాగా దర్శకుడు బాబీతో చేస్తున్న సాలీడ్ మాస్ డ్రామా కూడా ఒకటి.

ఈ సినిమా అనౌన్స్ మెంట్ నుంచే మంచి అంచనాలు ఈ సినిమాపై ఉన్నాయి. మరి ఈ సినిమాపై దర్శకుడు బాబీ లేటెస్ట్ గా ఒక మెగా మీటింగ్ లో మాట్లాడుతూ ఈ సినిమా టైటిల్ ని కన్ఫర్మ్ చేసాడు. మొన్న ఆ మధ్య ఆచార్య ప్రమోషన్స్ లో భాగంగా మెగాస్టార్ ఈ సినిమాకి “వాల్తేరు వీరయ్య” అని టైటిల్ పెట్టాం అని టైటిల్ ని మెగా లీక్ చేశారు.

మరి ఇప్పుడు ఇదే టైటిల్ ని ఈ దర్శకుడు కూడా కన్ఫర్మ్ చెయ్యడం వైరల్ గా మారింది. అలాగే ఈ సినిమా కోసం మాట్లాడుతూ మళ్ళీ మెగా ఫ్యాన్స్ మిస్ అవుతున్న ఘరానా మొగుడు, గ్యాంగ్ లీడర్, ముఠా మేస్త్రి నాటి చిరుని చూపిస్తున్నానని మెగా ఫ్యాన్స్ ఎక్కడా నిరాశ పడకుండా ఈ సినిమా ఉంటుంది అని హామీ ఇచ్చాడు. ఇక తాను చెప్పినట్టు గాని ఈ సినిమా ఉంటే మెగా ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ అని చెప్పాల్సిందే.