మెగాస్టార్ తో నిజంగానే మాస్ పూనకాలు ఇచ్చిన దర్శకుడు.!

గత కొన్ని రోజులు నుంచి టాలీవుడ్ స్టార్ దర్శకుడు బాబీ మెగాస్టార్ చిరంజీవి హీరో చేయబోయే సినిమాపై ఎగ్జైటింగ్ అప్డేట్స్ ని ఇస్తూ వస్తున్నాడు. తన సినిమాతో మళ్ళీ వింటేజ్ మెగాస్టార్ ని చూపించి పూనకాలు తెప్పిస్తానని చెబుతూ వస్తున్నాడు కానీ ఈ రేంజ్ లో ప్లాన్ చేసి మాస్ చూపిస్తాడని ఎవరూ ఊహించి ఉండరు. తన సినిమా నుంచి అసలు చిరంజీవి ఎలా ఉంటారో అన్నది రివీల్ చేస్తూ మైండ్ బ్లోయింగ్ పోస్టర్ ని రిలీజ్ చేశారు.

చిరు పాత సినిమాల్లో లుక్ ని గుర్తు చేస్తూ బాబీ డిజైన్ చేసిన ఈ పోస్టర్ సినీ వర్గాల్లో సంచలనం రేపుతోంది. చాలా కాలం నుంచి చిరు ని ఇలాంటి మాస్ లుక్ లోనే చూడాలి అనుకునే వాళ్ళకి ఇది అసలు పండుగ. మాస్ మూల విరాట్ ని పరిచయం చేస్తున్నాను అన్నయ్య అరాచకం ఇప్పుడు నుంచే ఆరంభం అంటూ బాబీ ఎగ్జైటింగ్ అప్డేట్ ని ఈరోజు ఇచ్చాడు. దీనితో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి. మరి ఫుల్ మూవీ ఎలా ఉంటుందో..