Gaddar Film Awards: ఇటీవల హైదరాబాద్ లో తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా గద్దర్ అవార్డుల కార్యక్రమం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని దిల్ రాజు దగ్గరుండి మరి చూసుకున్నారు. అయితే ఇలాంటి ప్రతిష్ఠాత్మక కార్యక్రమాన్ని చూసుకున్న నిర్మాత దిల్ రాజును రేవంత్ రెడ్డి కూడా ప్రశంసించిన విషయం తెలిసిందే. అయితే ఈ అవార్డు కార్యక్రమానికి చాలామంది సెలబ్రిటీలు రాకపోవడం పట్ల స్పందిస్తూ బహిరంగంగా ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ కామెంట్స్ పై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు నిర్మాత దిల్ రాజు.
ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ.. 2024కు సంబంధించిన గద్దర్ అవార్డ్స్ కి అందరూ వచ్చారు. మనం రాని దాని గురించి ఎక్కువ ఫోకస్ చేసి మాట్లాడుతున్నాము. 2024 ప్రయారిటీ అవార్డ్స్ దానికి అందరూ అటెండ్ అయ్యారు. 2014 నుంచి 2023 వరకు వచ్చిన సినిమాలకు ఇచ్చిన అవార్డులకు చాలా మంది రాలేదు. అది సెకండ్ ప్రయారిటీ. అంటే ఆ పది సంవత్సరాలు ఫిల్ చేయాలి కాబట్టి ప్రభుత్వం ఫిల్ చేసింది. అందుకే దీనికి సెకండ్ ప్రయారిటీ. ఆ రోజు నేను చెప్పిన దాని వెనక ఉన్న నా ఇన్‌టెన్షన్ వాళ్లు రాలేదు అని కాదు. అలాగే అక్కడ ఏపీలో కూడా ఫ్యూచర్ లో అవార్డ్స్ ఉంటాయి.
కాబట్టి అవార్డ్స్ ఉన్నప్పుడు అటెండెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ప్రభుత్వాలతో ఫ్రెండ్లీ అంబియన్స్ లో ఉండాలి. మనం వెళ్లి అవార్డ్ స్వీకరించడం ఇంపార్టెంట్. ప్రభుత్వం ఇచ్చేది తీసుకోవాలి అనేది నా ఇన్‌టెన్షన్. ఏపీలో చర్చలకు చంద్రబాబు పిలిచారు. షూటింగులు ఉన్నాయని కొందరు రాలేరు అని అన్నారు. అది నాకు నచ్చలేదు. సీఎం అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు మనం షూటింగ్ లను పక్కన పెట్టుకుని వెళ్లాలి. అంటే ప్రభుత్వంతో మనం ఫ్రెండ్లీ యాంబియన్స్ క్రియేట్ చేసి, అటెండ్ కావాల్సిన అవసరం మనకు ఉంది అని తెలిపారు దిల్ రాజు. ఈ సందర్భంగా దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు చేసిన మీడియాలో వైరల్ గా మారాయి.