మహేష్, అనిల్ రావిపూడి.. మధ్యలో పవన్ కళ్యాణ్

Pawan Kalyan, Anil Ravipudi
Pawan Kalyan, Anil Ravipudi
మహేష్ బాబుతో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా తర్వాత మరో సినిమా చేయాలని దర్శకుడు అనిల్ రావిపూడి గట్టిగా ఆశపడుతున్నారు.  వీరి ప్రాజెక్టుకు దిల్ రాజు నిర్మాతగా మారుతున్నారు.  ఆయన కూడ అనిల్ రావిపూడి కోసం మహేష్ బాబు డేట్స్ పట్టుకోవడానికి గట్టిగా ట్రై చేస్తున్నారు. ఎందుకంటే అనిల్ రావిపూడి మీద ఆయనకు గట్టి నమ్మకం ఉంది. మహేష్ బాబుకు సైతం అనిల్ రావిపూడితో సినిమా చేయాలనే ఉద్దేశ్యం ఉంది. కాకపోతే ప్రజెంట్ కమిట్మెంట్స్ మూలంగా ఆలస్యం అవుతోంది.  త్వరలో ఆయన త్రివిక్రమ్ సినిమా చేయాల్సి ఉంది.  అది అయ్యాక కూడ చేస్తారా లేదా అనేది డౌటే.  
 
రావిపూడి మాత్రం ‘ఎఫ్ 3’ ముగిస్తే ఖాళీ అయిపోతారు.  ఈ ఖాళీలో ఆయనతో సినిమా చేయించాలని దిల్ రాజ్ ప్లాన్ చేసున్నారట. అది కూడ పవన్ కళ్యాణ్ హీరోగా కావడం విశేషం. ప్రజెంట్ పవన్ రెండు సినిమాలు చేసున్నారు. వాటి తర్వాత హరీష్ శంకర్ సినిమా చేస్తారు. ఈ సినిమాలన్నీ వచ్చే ఏడాది సగంలోకి ముగుస్తాయి. ఆ తర్వాత వెంటనే అనిల్ రావిపూడితో సినిమా చేయిస్తే బాగుంటుందని దిల్ రాజు ఆలోచనట. అందుకే స్టోరీ సెట్టింగ్స్ కోసం పవన్ కళ్యాణ్ తో అనిల్ రావిపూడికి మీటింగ్ సెట్ చేయించే ప్రయత్నాల్లో ఉన్నారట.