వారసుడికి పేరు పెట్టిన దిల్ రాజు.. పేరు వెనుక అసలు అర్థం ఇదే…?

ప్రముఖ టాలివుడ్ నిర్మాత దిల్ రాజు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మొదట డిస్ట్రిబ్యూటర్ గా తన కెరీర్ ప్రారంభించిన దిల్ రాజు గారు తర్వాత ప్రొడ్యూసర్ గా మారి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు. ఈ క్రమంలో ఈయన ఇండస్ట్రీలో ఇప్పుడు స్టార్ ప్రొడ్యూసర్ గా గుర్తింపు పొందాడు. ఇదిలా ఉండగా ఇటీవల దిల్ రాజు గారు రెండవసారి తండ్రైన సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఇటీవల దిల్ రాజు రెండవ భార్య పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

మొదటి భార్య అనిత చనిపోయిన తర్వాత చాలా కాలం ఒంటరిగా ఉన్న దిల్ రాజు గారు కూతురి కోరిక మేరకు రెండేళ్ల క్రితం… డిసెంబర్ 10, 2020లో ‘దిల్’ రాజు గారు వాఘా రెడ్డి ( తేజస్వి) అనే యువతిని నిజామాబాద్‌లోని ఫామ్ హౌస్‌లో అతికొద్ది మంది కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో పెళ్లి వివాహాం చేసుకున్నాడు. అయితే ఇప్పుడూ దిల్ రాజు వారసుడికి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజగా దిల్ రాజు తన వారసుడికి నామకరణం చేశారని వార్తలు వినిపిస్తున్నాయి.

‘దిల్’ రాజు తన కుమారుడికి అన్వై రెడ్డి / అన్వయ్ రెడ్డి అని పేరు పెడుతున్నారట. ‘దిల్’ రాజు మొదటి భార్య పేరు అనిత. రెండో భార్య పేరు తేజస్వి. అయితే… పెళ్లికి ముందు తేజస్వి పేరుని వాఘా రెడ్డి అని మార్చారు. ఇద్దరు పేర్లలో అక్షరాలు కలిసి వచ్చేలా అన్వై / అన్వయ్ అని పేరు పెట్టారని ఫిల్మ్ నగర్ ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ప్రస్తుతం దిల్ రాజు తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘వారిసు’ తెలుగులో ‘వారసుడు’ అనే సినిమా నిర్మిస్తున్నారు. అయితే ఆ సినిమా షూటింగు మొదలైన తర్వాత దిల్ రాజు ఇంట వారసుడు అడుగు పెట్టడం విశేషం అని చాలా మంది అంటున్నారు.