DIL RAJU : దిల్ రాజు ముందు జాగ్రత్త, చరణ్ – శంకర్ సినిమాపై ముందే వార్నింగ్ ఇచ్చేసాడు.!

DIL RAJU : ప్రస్తుతం మన టాలీవుడ్ నుంచి వస్తున్న పలు భారీ చిత్రాల్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఇండియన్ జేమ్స్ కెమరూన్ శంకర్ ల కాంబోలో తెరకెక్కిస్తున్న ఓ భారీ చిత్రం కూడా ఒకటి. ఎనలేని అంచనాలు ఉన్న ఈ చిత్రాన్ని శంకర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు.
అలాగే ఈ భారీ సినిమాని తమ బ్యానర్ లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన నుంచి 50వ సినిమాగా అంతకు మించిన అంచనాలు తో నిర్మాణం వహిస్తున్నారు. అందుకే ఇతర సినిమల్లా కాకుండా ఇప్పుడు ముందే పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ భారీ చిత్రం షూట్ పై అప్డేట్ ఇస్తూ తాము ప్రెజెంట్ కొంచెం ఔట్ డోర్ లో సినిమా చేస్తున్నాం అని అందుకే చాలా మంది జనం బయట ఉంటారు..
అందుకే సినిమా షూట్ లీక్ అయ్యే ఛాన్స్ ఉంది అందుకే అలాంటివి అన్నీ అరికట్టడానికి అందరూ తప్పకుండా తమ మెయిల్ కి రిపోర్ట్ చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని ముందే వార్నింగ్ ఇచ్చారు. ఇది నిజంగా ఒక గ్రేట్ మూవ్ అని చెప్పాలి. ఇక ఈ భారీ చిత్రంలో చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు.
https://twitter.com/SVC_official/status/1493791899689181190?t=j-WG6CKs-PmWYddI_nOpMw&s=19