ఆ ఇద్దరూ దిల్ రాజు వలలో పడిపోయారు

Dil Raju locked those two heroes

Dil Raju locked those two heroes

ఎవరైనా హీరో లేదా డైరెక్టర్ ఫామ్లో ఉంటే నిర్మాతలు వారిని అస్సలు వదలరు. ఏదోలా వారిని లాక్ చేసేస్తారు. అడ్వాన్సులు ఇచ్చి మరీ డేట్స్ లాక్ చేసుకుంటారు. ఇలా బడా నిర్మాతల సంగతైతే చెప్పాల్సిన పనే లేదు. చిన్న హీరోలు హిట్ కొట్టి ఒక వెలుగు వెలిగారు అంటే అట్టే పట్టేస్తారు. ఈ విధానంలో స్టార్ ప్రొడ్యూజర్ దిల్ రాజు మరీ దిట్ట. ఇటీవల భారీ హిట్లు కొట్టిన ఇద్దరు యంగ్ హీరోలను దిల్ రాజు లాక్ చేసేశారట. ఆ హీరోలు ఎవరో కాదు వైష్ణవ్ తేజ్, నవీన్ పోలిశెట్టి.

వైష్ణవ్ తేజ్ తన తొలిచిత్రం ‘ఉప్పెన’తో భారీ బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఏ డెబ్యూ హీరోకి దక్కనంత గ్రాండ్ లాంఛ్ వైష్ణవ్ తేజ్ సొంతమైంది. రికార్డ్ స్థాయి వసూళ్లు వచ్చాయి. దీంతో అతనికి ఆఫర్లు వెల్లువెత్తాయి. ఇప్పటికే నాగార్జున ప్రొడక్షన్ తేజ్ ఒక సినిమాకు సైన్ చేయగా దిల్ రాజు కూడ అడ్వాన్స్ ఇచ్చేసి డేట్స్ పట్టేశారట. ఇక తాజాగా ‘జాతిరత్నాలు’తో నవీన్ పోలిశెట్టి కూడ హాట్ కేక్ అయ్యాడు.

ఈ సినిమా తొలిరోజే హిట్ టాక్ తెచ్చుకుని భారీ లాభాలను ఆర్జించి పెడుతోంది. ఆయనకు కూడ పలు నిర్మాణ సంస్థల నుండి ఆఫర్లు మొదలయ్యాయి. అందుకే ఆలస్యం చేయకుండా అతని డేట్స్ కూడ అడ్వాన్స్ ఇచ్చి పట్టేశారట దిల్ రాజు. వీరితో ఆయన సినిమాలు ఎప్పుడు చేస్తారు అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.