Vakeel Saab: ‘వకీల్ సాబ్’ మీద దిల్ రాజు ఇంకో 12 కోట్లు లాగాడట

Dil Raju gets 12 crore more profits from Vakeel Saab

Vakeel Saab: పవన్ కళ్యాణ్ సినిమా హిట్ అనే టాక్ తెచ్చుకుంటే వసూళ్ల ప్రభంజనం ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు. ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసే కలెక్షన్స్ ఖాయం. ‘అత్తారింటిది దారేది, గబ్బర్ సింగ్’ సినిమాలే ఇందుకు ఉదాహరణలు. కానీ ‘వకీల్ సాబ్’ విషయంలో అది జరగలేదు. సినిమా అయితే హిట్ టాక్ తెచ్చుకుంది. ఓపెనింగ్స్ అదిరిపోయాయి. 100 కోట్ల టార్గెట్ ఈజీగా క్రాక్ చేస్తుందని ట్రేడ్ పండితులు సైతం అనేశారు. కానీ చుట్టుముట్టిన వరుస కష్టాలు దెబ్బకొట్టాయి. సినిమా హాళ్లు హౌస్ ఫుల్ అయినా కలెక్షన్స్ అరకొరగానే ఉన్నాయి.

Dil Raju gets 12 crore more profits from Vakeel Saab
Dil Raju gets 12 crore more profits from Vakeel Saab

ఏపీలో టికెట్ రేట్లు తగ్గించడం, అదనపు షోలకు అనుమతులివ్వకపోవడంతో 20 నుండి 30 శాతం రాబడి పడిపోయింది. ఇక పెరిగిన కరోనా సెకండ్ వేవ్ ఉధృతి సినిమాను దారుణంగా దెబ్బతీసింది. థియేటర్లు మూతబడటంతో అర్థాంతరంగా సినిమా రన్ ముగిసిపోయింది. అక్కడక్కడా డిస్ట్రిబ్యూటర్లు కొంత నష్టపోయారు. కానీ నిర్మాత దిల్ రాజు మాత్రం ప్రాఫిట్స్ వెనకేసుకున్నారు. బిజినెస్ పరంగా, నైజాం థియేట్రికల్ రన్ మీద దిల్ రాజు గట్టిగానే వెనకేశారట.

అది కాకుండా సినిమాను అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఎర్లీ రిలీజ్ చేసినందుకు ఆయన ఇంకో 12 కోట్ల లాభాలు చూశారట. సాధారణంగా సినిమా రిలీజైన 50 రోజుల తర్వాత ఓటీటీలోకి వదలాలనేది ఒప్పందం. కానీ సినిమా హాళ్లు మూతబడటంతో 30వ తేదీ అర్థరాత్రి నుండి ఓటీటీ స్ట్రీమింగ్ ఇచ్చేశారు. ఇందుకు గాను ఆయనకు అమెజాన్ 12 కోట్లు చెల్లించిందట. మొత్తానికి దిల్ రాజు ‘వకీల్ సాబ్’ మీద గట్టిగానే వెనకేశారు.