Soundarya and Venkatesh : సౌందర్య, వెంకటేష్ టాలీవుడ్ తెరపై ఒకప్పుడు హిట్ పెయిర్. ‘రాజా’, ‘పెళ్లి చేసుకుందాం’, ‘పవిత్ర బంధం’.. ఇలా తదితర సక్సెస్‌ఫుల్ మూవీస్‌లో నటించారు ఈ ఇద్దరూ కలిసి. అయితే, ఒకానొక టైమ్‌లో వీరిద్దరి మధ్యా గొడవలు తలెత్తాయని అంటుంటారు. చిలికి చిలికి గాలివానలా మొదలైన ఆ గొడవలు కాస్తా సీరియస్ అయ్యాయనీ చెబుతుంటారు.
‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ సినిమాలో సౌందర్య, వెంకటేష్ నటించిన సంగతి తెలిసిందే. అప్పట్లో సెన్సేషనల్ హిట్ అయ్యింది ఆ సినిమా. అయితే, ఆ సినిమాని పూర్తి చేసేందుకు మేకర్లు చాలా కష్టపడ్డాడరట. అందుకు కారణం సౌందర్య, వెంకటేష్ మధ్య గొడవలే అని వారి సన్నిహితులు చెబుతుంటారు.
ఆ గొడవల కారణంగానే షూటింగ్ మధ్యలోనే ఆపేసి సౌందర్య వెళ్లిపోయిందని అంటుంటారు. మేకర్లు బతిమలాడి, సర్దిచెప్పి ఎలాగోలా షూటింగ్ పూర్తి చేశారట. చాలా కాలం వీరిద్దరి మధ్యా ఆ క్లాషెస్ అలాగే కొనసాగాయట. అయితే, ఆ విషయం ఇటు సౌందర్య దగ్గర గానీ, అటు వెంకీ దగ్గర గాని ప్రస్థావిస్తే నో కామెంట్ అని లైట్ తీసుకునేవారట.
అప్పట్లో టాలీవుడ్ సావిత్రిగా అభివర్ణించేవారు సౌందర్యను. ఉన్నతమైన వ్యక్తిత్వం ఆమె సొంతం. హీరోయిన్‌గా కెరీర్ పీక్స్‌లో వున్న సమయంలోనే అర్ధాంతరంగా విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయి, యావత్ తెలుగు ప్రజానీకాన్ని శోక సంద్రంలో ముంచేసింది.
సౌందర్య బతికే వుంటే, ఆమె కోసం ఎన్నో, మరెన్నో అద్భుతమైన పాత్రలు పుట్టి వుండేవేమో కదా.