చంద్రముఖి సినిమాలో ముందుగా అవకాశం వచ్చింది జ్యోతికకు కాదా.. మరెవరికంటే?

వాసు దర్శకత్వంలో రజనీకాంత్, ప్రభు, జ్యోతిక, నయనతార వంటి వారు ప్రధాన పాత్రలలో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం చంద్రముఖి. ఈ సినిమా అప్పట్లో ఎలాంటి రికార్డు సృష్టించిందో మనందరికీ తెలిసిందే. ఎంతో సూపర్ హిట్ అయినటువంటి ఈ సినిమా ప్రస్తుతం సీక్వెల్ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఇలా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకున్న ఈ సినిమాలో నటి జ్యోతిక చంద్రముఖి పాత్రలో లీనం అయిపోయింది అని చెప్పాలి.

ఇక ఈ సినిమా చూసి ఇప్పటికీ భయపడే వాళ్ళు ఉన్నారంటే ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు. అంతగా తన నటనతో అందరిని భయభ్రాంతులకు గురి చేశారు నటి జ్యోతిక.అయితే ఈ సినిమాలో జ్యోతిక కన్నా ముందు వేరే హీరోయిన్ కు అవకాశం వచ్చిందట. అసలు ఈ సినిమాలో నటించాల్సింది జ్యోతిక కాదని చంద్రముఖి పాత్రలో నటించే అవకాశం ముందుగా నటి సిమ్రాన్ కి వచ్చిందని తెలుస్తుంది.

సిమ్రాన్ ఈ సినిమా షూటింగ్లో దాదాపు 15 రోజులపాటు పాల్గొని అనంతరం ఆమె ఈ సినిమా నుంచి తప్పకున్నారు.ఈ విధంగా సిమ్రాన్ ఈ సినిమా నుంచి తప్పుకోవడానికి గల కారణం ఆమె ప్రెగ్నెంట్ కావడమే.సిమ్రాన్ ప్రెగ్నెంట్ కావడంతో ఈ సినిమాలో నటించలేనని సిమ్రాన్ తప్పుకోవడంతో ఆమె స్థానంలోకి నటి జ్యోతికను తీసుకున్నారు. అలా చంద్రముఖి అవకాశాన్ని జ్యోతిక అందుకొని మంచి అద్భుతమైన సినిమాని తన ఖాతాలో వేసుకున్నారు. చంద్రముఖిగా జ్యోతిక ఈ పాత్రకు 100% న్యాయం చేసిందని చెప్పాలి.

YouTube video player