నాగచైతన్య కోసమే సమంత వెనక్కి తగ్గిందా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మొదటి సినిమాతోనే తన మాటలతో, అందంతో మాయ చేసిన సమంత ప్రస్తుతం తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ వంటి భాషలలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. టాలీవుడ్ హీరో నాగచైతన్య పెళ్లి చేసుకున్న సమంత కొంతకాలానికి అతని నుండి విడిపోయింది. టాలీవుడ్ లోనే బెస్ట్ కపుల్ గా ఉన్న వీరిద్దరూ కారణాలవల్ల విడిపోయారు. నాగచైతన్య నుండి విడిపోయిన తర్వాత వరుస సినిమాలతో సమంత ఫుల్ బిజీ అయిపోయింది.అంతేకాకుండా ఈ మధ్యకాలంలో గ్లామరస్ ఫోటోలతో సోషల్ మీడియాలో కూడా రచ్చ చేస్తోంది.

ఇదిలా ఉండగా ప్రస్తుతం సమంత తెలుగులో నటించిన శాకుంతలం, యశోద సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ క్రమంలో సమంత నాగచైతన్య గురించి మరొక వార్త ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. సమంత నటించిన యశోద సినిమా ఆగస్టు 12వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది. ఇటీవల ఈ సినిమా నుండి విడుదలైన ట్రైలర్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దీంతో సమంత అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అందువల్ల ఈ సినిమా ఆగస్టు 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుందని దర్శక నిర్మాతలు అధికారిక ప్రకటన చేశారు.

ఇక మరొకవైపు హిందీలో అమీర్ ఖాన్ హీరోగా నటిస్తున్న “లాల్ సింగ్ చద్దా” సినిమాని నాగచైతన్య ఆగస్టు 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. దీంతో విడిపోయిన తర్వాత కూడా భార్యాభర్తల మధ్య గట్టి పోటీ ఉంటుందని అందరూ భావించారు. కానీ తాజాగా సమంత నటించిన యశోద సినిమా విడుదల తేదీ పోస్ట్ పోన్ చేసినట్టు చిత్ర వర్గాలు ప్రకటించాయి. ఇదిలా ఉండగా ఆగస్టు 11వ తేదీన లాల్ సింగ్ చద్దా సినిమాని నాగచైతన్య విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. అందువల్ల నాగచైతన్య కోసం సమంత తన సినిమా విడుదల తేదీ పోస్ట్ పోన్ చేసుకుంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే సమంత సినిమా పోస్ట్ పోన్ చేయటానికి గల కారణాలు ఇంకా తెలియటం లేదు.