మహేష్ బాబుకు పిల్లల సెంటిమెంట్‌ వర్కౌట్‌ కాలేదా..?

ఇటీవల మహేష్ బాబు కీర్తి సురేష్ జంటగా నటించిన సినిమా సర్కారు వారి పాట. ఈ సినిమాకు పరశురాం దర్శకత్వం వహించగా.. తమన్ సంగీతాన్ని అందించాడు. సర్కార్ వారి పాట సినిమా మే 12వ తేదీన విడుదలైన సంగతి అందరికీ తెలిసిన విషయమే. చాలా కాలం తర్వాత ఈ సినిమా ద్వారా మహేష్ బాబు ప్రేక్షకుల ముందుకు రావడంతో ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని భావించారు. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ సినిమా యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ లో ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేశారు. సెకండాఫ్ మాత్రం కొంచెం బోరింగ్ గా ఫీల్ అవుతున్నారు.

మొత్తానికి మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా మాత్రం యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా కరెక్టుగా ప్రేక్షకులకి చేరితే మంచి కలెక్షన్లు సాధిస్తుంది.. మహేష్ బాబు సినిమా అంటే మినిమం వంద కోట్లు కలెక్షన్లు ఖాయం . అలాంటిది కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా సినిమా గురించి నెగిటివ్ కామెంట్స్ స్ప్రెడ్ చేయటంతో ఈ సినిమా మీద చాలా ఎఫెక్ట్ పడిందని మహేష్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులు ఉద్దేశపూర్వకంగానే ఈ సినిమా గురించి తప్పుడు ప్రచారం చేసి సినిమాను తక్కువ చేస్తున్నారంటూ మహేష్ బాబు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా మరికొందరు మహేష్ బాబు పిల్లల్ని కూడా ఇందులోకి లాగుతున్నారు.

ఇదివరకు మహేష్ బాబు నటించిన 1 నేనొక్కడినే సినిమాలో గౌతమ్ నటించాడు. మహేష్ బాబు నటించిన ఆ సినిమా కూడా ఫ్లాప్ అయింది. ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా లిరికల్ వీడియోలో సితార సందడి చేసింది. అందువల్ల ఈ సినిమా కూడా హిట్ అవ్వలేదు అని కొందరు నెగెటివ్ కామెంట్స్ పెడుతున్నారు. ఒక సినిమా హిట్ అవడానికి కి కంటెంట్ చాలా అవసరం. అంతేకాని సినిమా ప్లాప్ అవ్వటానికి మహేశ్ బాబు పిల్లలు కారణం అనటం సరైనది కాదని మహేష్ అభిమానులు ఇలాంటి కామెంట్లను తిప్పి కొడుతున్నారు.