Puspha Movie: పుష్ప సినిమా ఆ సీన్ లో చంద్రబాబు నాయుడు… గమనించారా?

Puspha Movie: క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సినిమా పుష్ప. పాన్ ఇండియా స్థాయిలో డిసెంబర్ 17వ తేదీ విడుదలైన ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్లను రాబట్టి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో లో ప్రసారం అవుతూ ఇక్కడ కూడా అద్భుతమైన హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇకపోతే ఇప్పటివరకు పుష్ప సినిమా గురించి తెలియని ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పుష్ప సినిమాలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కనిపిస్తున్నట్లు ఒక వార్త నెట్టింట్లో వైరల్ గా మారింది.

అసలు పుష్ప సినిమాకు చంద్రబాబు నాయుడుకి మధ్య సంబంధం ఏమిటి? ఈ సినిమాలో చంద్రబాబు నాయుడు ఎక్కడ కనిపిస్తారు అనే సందేహం ప్రతి ఒక్కరికి కలుగుతుంది. అసలు విషయానికి వస్తే పుష్పా సినిమా 1995 మంచి 2004వ సంవత్సరం మధ్యలో చూపించినట్లు ఈ సినిమాలో చూపించారు. ఈ క్రమంలోనే ఆ సంవత్సరంలో చిత్తూరు జిల్లాలో జరిగిన ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది.ఇకపోతే అదే సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టారు.

ఈ క్రమంలోనే ఈ సినిమాలో పలు సన్నివేశాలలో చంద్రబాబు నాయుడు ఫోటోలు పెట్టి సుకుమార్ ఈ సినిమాని తెరకెక్కించారు.ఈ సినిమాలో పోలీస్ స్టేషన్ లోనూ అదేవిధంగా ఒక టీ కొట్టులో కూడా చంద్రబాబు నాయుడు ఫోటోలను మనం చూడవచ్చు.ఇలా అప్పట్లో జరిగిన కథను దృష్టిలో పెట్టుకుని సుకుమార్ ఈ విధంగా అప్పటి ముఖ్యమంత్రి ఫోటోలను కూడా పెడుతూ సినిమా విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం చంద్రబాబు నాయుడుకు సంబంధించిన ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.