టీడీపీ నేతలు సీనియర్ ఎన్టీఆర్ భార్యగా లక్ష్మీపార్వతిని గుర్తించబోమని చెబుతున్న సంగతి తెలిసిందే. లక్ష్మీ పార్వతి తరచూ చంద్రబాబుపై విమర్శలు చేస్తుండగా టీడీపీ నేతలు సైతం ఏ ఛాన్స్ వచ్చినా వదలకుండా లక్ష్మీ పార్వతిపై విమర్శలు చేస్తున్నారు. అయితే ఒక విధంగా చెప్పాలంటే లక్ష్మీపార్వతి వల్లే చంద్రబాబు సీఎం అయ్యారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. లక్ష్మీపార్వతి పేరును అడ్డుపెట్టుకుని ఆమె గురించి వ్యతిరేకంగా ప్రచారం చేయడం ద్వారా సీనియర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి పదవిని పోగొట్టుకునేలా చేశారు.
లక్ష్మీపార్వతిని సీనియర్ ఎన్టీఆర్ అధికారికంగా పెళ్లి చేసుకున్నారనే సంగతి తెలిసిందే. లక్ష్మీపార్వతిని అడ్డుపెట్టుకుని వెన్నుపోటు పొడవడంతో ఇప్పటికీ ప్రతిపక్ష నేతలు చంద్రబాబును ఈ విషయంలో తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. లక్ష్మీపార్వతి గురించి నెగిటివ్ గా చెప్పడం వల్లే సీనియర్ ఎన్టీఆర్ కొడుకులు, కూతుళ్లు ఎన్టీఆర్ కు కాకుండా చంద్రబాబుకు సపోర్ట్ చేయడం జరిగింది.
పరోక్షంగా లక్ష్మీపార్వతి వల్ల ఊహించని స్థాయిలో లబ్ధి పొందిన వ్యక్తి చంద్రబాబు మాత్రమేనని నెటిజన్లు చెబుతున్నారు. లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ జీవితంలో లేకపోయి ఉండి ఉంటే చంద్రబాబు సీఎం అయ్యేవారు కాదని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. చంద్రబాబు పదవికి దూరం చేయడం వల్లే సీనియర్ ఎన్టీఆర్ మరణించారని ఎన్టీఆర్ అభిమానులు భావిస్తారు.
మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ టీడీపీలో యాక్టివ్ అయితే లోకేశ్ కు అన్యాయం జరుగుతుందని చంద్రబాబు భావిస్తుండటం గమనార్హం. అందువల్ల జూనియర్ ఎన్టీఆర్ టీడీపీలో యాక్టివ్ కాకుండా చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. గతంలో పలువురు టీడీపీ నేతలు జూనియర్ ఎన్టీఆర్ సినిమాల గురించి నెగిటివ్ గా ప్రచారం చేశారనే సంగతి తెలిసిందే. తారక్ మాత్రం తన గురించి తప్పుగా ప్రచారం చేసినా టీడీపీ గురించి ఎప్పుడూ నెగిటివ్ గా మాట్లాడలేదు.