ఆ రెండు తేదీలని లింక్ చేస్తూ మెగాస్టార్ ఇలా కామెంట్ చేస్తాడని ఎవరైనా ఊహించారా ..?

కొణిదెల శివ శంకర వరసాద్.. ఒక సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చి చిన్న పాత్రతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి ఎన్నో ఆటుపోట్లని ఎదుర్కొని.. ఎన్.టి.ఆర్, ఏ.ఎన్.ఆర్, సూపర్ స్టార్ కృష్ణ లాంటి వారు అప్పటికే స్టార్ గా వెలుగు వెలుగుతున్నప్పటికి అతికొద్ది కాలంలోనే అతి తక్కువ సినిమాలతోనే టాలీవుడ్ లో ఒక స్టార్ గా ఎదిగారు. అంతేకాదు తన నటన తో. డాన్స్ తో తనకి తానే సాటి అని నిరూపించుకొని సుప్రీం హీరోగా ఆ తర్వాత మెగాస్టార్ గా యావత్ భారదేశం మొత్తం గర్వించదగ్గ నటుడిగా అసాధారణమైన పాపులారిటీని, క్రేజ్ ని సంపాదించుకున్నారు.

Megastar Chiranjeevi spills the beans about new movie

విజేత, ఖైదీ, స్వయంకృషి, లాంటి సినిమాలతో ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. ఇక మెగాస్టార్ లాంటి కమర్షియల్ హీరో ఆయన అందుకున్నన్ని కమర్షియల్ బ్లాక్ బస్టర్స్ మరొకరు అందుకోలేదంటే ఆయన సినిమాలకి ప్రేక్షకుల్లో ఎంతటి క్రేజ్ ఉండేదో అర్థం చేసుకోవచ్చు. కథ ఎలాంటిదైనా తనదైన శైలిలో ప్రాణం పోయడం మెగాస్టార్ లో ఉన్న ప్రత్యేకత. తన పాత్ర కి ఇంపార్టెన్స్ లేకపోయిన ఒక అమ్మాయి పాత్ర విపరీతంగా నచ్చి సినిమా చేయగల సత్తా ఉందని ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ సినిమాతో నిరూపించారు.

కమర్షియల్ ఫార్మాట్ లోనే స్టాలిన్, ఠాగూర్ లాంటి సందేశాత్మకమైన సినిమాలని చేశారు. ఇప్పటికీ అందరితో అన్నయ్య అని పిలిపించుకుంటూ ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉన్నారు. కాగా తాజా అన్నయ్య మెగాస్టార్ సోషల్ మీడియా అయిన ట్విటార్ లో పెట్టిన పోస్ట్ ఆయన ఎదుగుదలకి నిదర్శనంగా కనిపిస్తుంది. అంతేకాదు మెగాస్టార్ ఈ పోస్ట్ పెట్టడం వెనక ఆయన కష్టం.. కృషి.. ప్రేక్షకుల అభిమానం .. ఇలా అన్ని కనిపిస్తున్నాయి.