ఢీ షో.. ఇది డ్యాన్స్ షో కాదు ముద్దుల షో.. !

ప్రేక్షకులను అలరించడానికి బుల్లితెర మీద ఎన్నో రకాల టీవీ షోలు ప్రసారం అవుతూ ఉంటాయి. అయితే వాటిలో కొన్ని మాత్రమే ఏళ్ల తరబడి ప్రసారం అవుతూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాయి. అటువంటి టీవీ షోస్ లో ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్,ఢీ, క్యాష్ వంటివి మంచి గుర్తింపు పొందాయి. ఈటీవీ లో ప్రసారమయ్యే ఏ సీరియల్స్ అయిన టీవీ షోస్ అయిన ఏళ్ల తరబడి ప్రసారం అవుతూనే ఉంటాయి. బుల్లితెర మీద ప్రసారమవుతున్న డాన్స్ షో లలో ఢీ షో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఎన్నో నో ఏళ్లుగా ప్రసారం అవుతున్న ఈ ఢీ షో ఇప్పటివరకు 13 సీ పూర్తి చేసుకొని ప్రస్తుతం 14 వ సీజన్ ప్రసారమవుతుంది.

ఈ ఢీ షో ద్వారా ఎంతో మంది డాన్సర్లుగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. ఢీ షో లో కంటెస్టెంట్ లు గా పాటిస్పేట్ చేసిన వారు ప్రస్తుతం చాలామంది ఇండస్ట్రీలో డాన్స్ కొరియోగ్రాఫర్లుగా మంచి గుర్తింపు పొందారు. ఢీ షో ఇలా ఎంతోమందికి జీవితాన్ని ఇచ్చింది. మునుపటి సీజన్లో అలాగే ఈ సీజన్ కూడా సక్సెస్ ఫుల్ గా సాగిపోతోంది. అయితే ఈ షో లో జడ్జ్ లతో సహా టీం లీడర్లు కూడా కొత్త వారు ఉన్నారు. గణేష్ మాస్టర్, ప్రియమణి, నందితా శ్వేత జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు. ఈ వారం ప్రసారం కాబోయే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదలైంది. ఈ ప్రోమో లో చైల్డ్ ఆర్టిస్ట్ నిశాంత్ సందడి చేశాడు.

YouTube video player

ఢీ షో లో నిషాంత్ తన డాన్స్ తో అందరిని అలరించాడు. అంతటితో ఆగకుండా ప్రియమణి, నందిత శ్వేత మీద ముద్దుల వర్షం కురిపించాడు. అంతే కాకుండా అక్కడున్న లేడీ కంటెస్టెంట్ లకు ముద్దులు, హగ్గులు ఇస్తూ రెచ్చిపోయాడు.ఇలా నిషాంత్ అందరికీ ముద్దులు ఇవ్వటంతో ఆది కొంచం జలసిగా ఫీల్ అయ్యాడు. ఆది మీద కూడా పంచ్ లు వేస్తూ ఎంతో సందడిగా సాగిపోయిన ఈ ఎపిసోడ్ కి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన కొందరు నెటిజన్లు మాత్రం ఇది డాన్స్ షో కాదు.. ముద్దుల షో అంటూ కామెంట్లు పెడుతున్నారు.