Dhanya Balakrishna: తెలుగు నటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ ధన్య బాలకృష్ణ గురించి మనందరికీ తెలిసిందే. మొదట క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరియర్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత హీరోయిన్ గా మారిన విషయం తెలిసిందే. హీరోయిన్గా మారి పలు సినిమాలలో నటించి మెప్పించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఒకవైపు వెబ్ సిరీస్ లు సినిమాలలో నటిస్తూనే అప్పుడప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులకు చేరువగా ఉంది ఈ ముద్దుగుమ్మ. ధన్య బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ ది 100. ఈ సినిమా జులై 11వ తేదీన విడుదల కానుంది.
ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలను వేగవంతం చేశారు మూవీ మేకర్స్. ఈ ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగంగా ధన్య బాలకృష్ణ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ముఖ్యంగా మహేష్ బాబు గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది ధన్య బాలకృష్ణ. సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో మహేష్ బాబు కి ప్రపోజ్ చేసే సన్నివేశం గురించి మాట్లాడుతూ.. ఆ సినిమా సమయానికి నాకు తెలుగు రాదు. చెన్నై నుంచి వచ్చాను. ఫస్ట్ సీనే ప్రపోజల్ సీన్. మహేష్ గారి కళ్ళు చూసి చెప్పాలి అన్నారు. నాకు భయం వేసింది.
పెద్ద స్టార్స్ మనం టేక్స్ ఎక్కువ తీసుకుంటే ఏమనుకుంటారో, చిరాకుపడతారో అని భయం. అప్పటికి రెండు టేకులు తీసుకున్నాను. నేను వెంటనే మహేష్ గారికి సారీ చెప్పాను. ఆయన పర్లేదు టైం తీసుకో, డైలాగ్స్ నేర్చుకొని చెప్పు, నో ప్రాబ్లమ్ కూల్ అన్నారు. అలాంటి సమయంలో ఎదుటివాళ్ళు మన వల్ల ఇబ్బంది పడితే అస్సలు చేయలేము. కానీ ఆయన కూల్ గా మాట్లాడటంతో నేను కూల్ అయి డైలాగ్స్ చెప్పాను. నేను టేక్స్ తీసుకున్నా ఆయన కూల్ గానే ఉన్నారు అని తెలిపింది. ఈ సందర్భంగా ధన్య బాలకృష్ణ చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
