Dhanush Father : జస్ట్ గత కొన్ని రోజులు కితమే కోలీవుడ్ స్టార్ హీరో మరియు దర్శకురాలు కం సూపర్ స్టార్ రజినీకాంత్ తనయురాలు ఐశ్వర్య రజినీకాంత్ విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అస్సలు ఎవరూ ఊహించని ట్విస్ట్ ఇది కావడంతో ఈ షాక్ నుంచి అభిమానులు ముఖ్యంగా అంత తేలిగ్గా తేరుకోలేకపోతున్నారు.
ఇక అసలు వీరు ఎందుకు విడాకులు తీసుకున్నారు అనే అంశం ఇంకా వైరల్ టాక్ గా నడుస్తుండగా ఇదే సమయంలో ధనుష్ తంత్రీ అయినటువంటి కస్తూరి రాజా చేసిన కామెంట్స్ ఆసక్తి రేపుతున్నాయి. ఇద్దరి మధ్య కొన్ని మనస్పర్థల వల్ల వారు విడాకులు వరకు వెళ్లిపోయారని కానీ మళ్ళీ వారు తిరిగి కలుస్తారని షాకింగ్ ట్విస్ట్ ఇచ్చారు.
వారు ఇద్దరితో తాను రజిని కూడా మాట్లాడ్డం జరిగిందని మళ్ళీ వారి విడాకుల విషయంలో పునరాలోచన చేసుకోవాలని సూచించామని దానిని బట్టి మళ్ళీ నిర్ణయం తీసుకుంటారని వారు మళ్ళీ తప్పకుండా కలుస్తారని చేసిన కామెంట్స్ ఇప్పుడు సినీ వర్గాల్లో సహా తమిళ మీడియా వర్గాల్లో హాట్ టాపిక్ గా వైరల్ అవుతున్నాయి.
మరి ఆయన చెప్పినట్టుగానే ఈ ఊహించని పరిణామం జరుగుతుందో లేదో చూడాలి మరి. ప్రస్తుతం అయితే ధనుష్ మరియు తన మాజీ భార్య ఐశ్వర్య లు ఇద్దరు కూడా ఇక్కడ లేరని తెలుస్తుంది. మరి వారేం చెప్తారో అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.