తెలుగు, తమిళ్ లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా పాపులర్ అయిన దేవి శ్రీ ప్రసాద్ ఈ మధ్య అంతగా ఫామ్ లో లేడు. కేవలం ‘పుష్ప’ సినిమా తప్ప దేవి ఖాతాలో పెద్ద మ్యూజికల్ హిట్స్ లేవు. ఏజ్ బార్ అవతున్నా ఇంకా పెళ్లి చేసుకోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ల లిస్ట్ లో దేవి శ్రీ ప్రాసద్ కూడా ఉన్నాడు.
ఒకప్పుడు దేవి, చార్మ్ లవ్ లో ఉండేవారు. వీళ్లిద్దరు పెళ్లిచేసుకుంటారు అనుకున్న సమయంలో ఇద్దరూ విడిపోయారు. ఛార్మి పూరి జగన్నాధ్ తో కలిసి ఉంటే….దేవి శ్రీ ప్రసాద్ మాత్రం ఇంకా సింగల్ గానే ఉన్నాడు.
రీసెంట్ గా దేవి శ్రీ ప్రసాద్ టాలీవుడ్ కు చెందిన నటిని సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారంటూ కూడా ఇటీవల మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. ఆ నటి పూజిత పొన్నాడ. అయితే దీనిపైన దేవి శ్రీ ప్రసాద్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. మరి ఈ వార్తలో నిజం ఎంతో తెలియాల్సి ఉంది.