దేవ కట్టా, ‘మెగా’ డైరెక్టర్ అయిపోయినట్టేనా.?

‘రిపబ్లిక్’ సినిమాతో తనదైన ప్రత్యేకతను ఇంకోసారి గట్టిగానే చాటుకున్న విలక్షణ దర్శకుడు దేవ కట్టా, మరో మెగా హీరోతో ఇంకో సినిమా మెగా కాంపౌండ్‌లో చేయబోతున్నాడన్న ప్రచారం జరుగుతోంది. సాయిధరమ్ తేజ్ హీరోగా దేవ కట్టా దర్శకత్వంలో ‘రిపబ్లిక్’ సినిమా రూపొందిన సంగతి తెలిసిందే.

‘రిపబ్లిక్’ సినిమా తర్వాత మెగా కాంపౌండ్ నుంచి పలువురు హీరోలు దేవ కట్టా దర్శకత్వంలో పనిచేసేందుకు ఆసక్తి చూపుతున్నారట. మరోపక్క, మెగా కాంపౌండ్‌లోనే ఇద్దరు హీరోలకు దేవ కట్టా కథలు ఇప్పటికే సిద్ధం చేశాడంటున్నారు.

దేవ కట్టా, పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతోందంటూ ఓ గాసిప్ తెరపైకొచ్చింది. ఇంతలోనే, పవన్ కళ్యాణ్ కాదు.. చిరంజీవి ఆ సినిమా చేస్తారని అంటున్నారు. సీన్‌లోకి తాజాగా పంజా వైష్ణవ్ తేజ్ పేరు కూడా వచ్చింది.

అయితే, దేవ కట్టా.. ‘రిపబ్లిక్’ సినిమా సక్సెస్‌ని ప్రస్తుతం ఎంజాయ్ చేస్తున్నాడు. తర్వాతి మెగా హీరో ఎవరు.? అన్న ప్రశ్నకు మాత్రం ఆయన ఇంకా సరైన సమాధానమివ్వడంలేదు. కాగా, ‘మెగా డైరెక్టర్’ అన్న ట్యాగ్ అయితే దేవ కట్టా ఇప్పటికే సంపాదించేయడం గమనార్హం.