ఇప్పుడు టాలీవుడ్ లో రెడీ అవుతున్న మరో బిగ్ మల్టీ స్టారర్ చిత్రాల్లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా అలాగే మాస్ మహారాజ రవితేజ ఒక కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం కూడా ఒకటి. ప్రస్తుతానికి మెగా 154 సినిమాగా పిలవబడుతున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా కంప్లీట్ అవుతుండగా దర్శకుడు బాబీ సినిమాపై ఈరోజు డబ్బింగ్ అప్డేట్ కూడా అందించాడు.
ఇక ఇదిలా ఉండగా ఈ మాస్ ప్రాజెక్ట్ పై అయితే అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్న మాసివ్ అప్డేట్స్ ఇప్పుడు బయటకి వచ్చేసాయి. ఈ సినిమా నుంచి టైటిల్ ని అలాగే ఏవైతే టీజర్ ని ఈ దీపావళి కానుకగా రిలీజ్ చేస్తున్నట్టు సినిమా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ కన్ఫర్మ్ చేసేసారు.
అంటే ఈ అక్టోబర్ 24న ఈ బిగ్ ట్రీట్ రావడం ఖాయం అయ్యిపోయింది. దీనితో ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఆ రోజు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇంకా ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే వచ్చే ఏడాది జనవరి 11న రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు.
🔥🔥🔥#Mega154
Title Teaser
For Diwali
🔥🔥🔥 https://t.co/hBLOjQlMjI— Mythri Movie Makers (@MythriOfficial) October 14, 2022