Danush: నమ్మినందుకు రోడ్డుపై అడుక్కుతినేలా చేశాడు… దర్శకుడి పై ధనుష్ హాట్ కామెంట్స్?

Danush: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ శేఖర్ కమ్ముల కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం కుబేర ఈ సినిమా జూన్ 20వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మరి కొన్ని గంటలలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో సినిమాపై భారీ స్థాయిలోనే అంచనాలు కూడా ఉన్నాయి. ఇకపోతే ఈ సినిమా గురించి హీరో ధనుష్ మాట్లాడుతూ డైరెక్టర్ శేఖర్ కమ్ములపై చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

తాను హాలీవుడ్ ఇండస్ట్రీలో ది గ్రే మ్యాన్ షూటింగ్ జరుగుతున్న సమయంలో శేఖర్ కమ్ముల గారు వీడియో కాల్ ద్వారా 20 నిమిషాల పాటు కుబేర సినిమాకు సంబంధించిన స్టోరీ లైన్ చెప్పారు. నాకు ఈ స్టోరీ లైన్ నచ్చడంతో ఓకే చెప్పాను ఇక కథ సిద్ధం చేయడానికి దాదాపు రెండేళ్లు పట్టిందని తెలిపారు. ఇక అప్పటివరకు తాను శేఖర్ కమ్ముల గారిని ఎప్పుడు కలిసింది లేదు కానీ బయట మాత్రం తాను శేఖర్ కమ్ములతో సినిమా చేస్తున్నానని చెప్పగానే ప్రతి ఒక్కరూ చాలా మంచి డైరెక్టర్ తో చేస్తున్నావు ఆయన బెస్ట్ డైరెక్టర్ అంటూ చాలా గొప్పలు చెప్పారు.

ఇక రెండేళ్ల తర్వాత ఈ సినిమా షూటింగ్లో పాల్గొంటే ఆయన ఏకంగా నన్ను రోడ్డుమీదకు తీసుకొచ్చి బిచ్చం ఎత్తుకొనెలా చేశారు అంటూ సరదాగా మాట్లాడారు. తిరుపతి రోడ్లపై అమ్మ, అయ్య అంటూ బిచ్చం ఎత్తుకున్నానని, చివరికి నన్ను రోడ్డుమీదకు పడేశారు అంటూ శేఖర్ కమ్ముల గురించి ధనుష్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి అయితే ఈయన సరదాగా ఈ వ్యాఖ్యలు చేశారని, మొదటిసారి తాను బెగ్గర్ పాత్రలో నటించబోతున్నానని ఈ సందర్భంగా ధనుష్ క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ సినిమా చాలా అద్భుతంగా వచ్చిందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ధనుష్ కు జోడిగా రష్మిక నటించిన విషయం తెలిసిందే. ఇక అక్కినేని నాగార్జున కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు.