కేజీఎఫ్ 2 నుండి క్రేజీ అప్‌డేట్.. ఆస‌క్తిగా గ‌మనిస్తున్న ఫ్యాన్స్

భార‌తీయ సినీ ప‌రిశ్రమ స్థాయిని రెట్టింపు చేసిన చిత్రాల‌లో కేజీఎఫ్ 2 కూడా ఒక‌టి. క‌న్న‌డ క‌థానాయ‌కుడు హీరోగా ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం సైలెంట్‌గా వ‌చ్చి సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర 200 కోట్లకు పైగా వ‌సూళ్ళు రాబ‌ట్టి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. క‌న్న‌డ‌లోనే కాకుండా అన్ని భాష‌ల‌లోను ఈ చిత్రానికి మంచి ఆద‌ర‌ణ ద‌క్కింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా ప్ర‌శాంత్ నీల్ కేజీఎఫ్ 2 చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. రీసెంట్‌గా చిత్ర షూటింగ్ పూర్తైంది.

కేజీఎఫ్ 2 చిత్ర పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్యక్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతుండగా, సమ్మ‌ర్‌లో మూవీని రిలీజ్ చేసే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక జ‌న‌వ‌రి 8న కేజీఎఫ్ హీరో య‌శ్ బ‌ర్త్ డే కావ‌డంతో ఆ రోజు చిత్ర టీజ‌ర్‌ని విడుద‌ల చేయ‌నున్న‌ట్టు కొద్ది రోజుల ముందు ప్ర‌క‌టించారు. ఇక తాజాగా టైంని ఫిక్స్ చేశారు. ఉద‌యం 10.18ని.లకు కేజీఎఫ్ 2 టీజ‌ర్ రానున్న‌ట్టు పేర్కొన్నారు. మ‌రో నాలుగు రోజుల‌లో రానున్న టీజ‌ర్ సినిమాపై భారీ అంచనాలు పెంచ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది.

కేజీఎఫ్ 2 చిత్రంలో క‌న్న‌డ న‌టులే కాకుండా తెలుగు, హిందీ న‌టులు న‌టిస్తున్నారు. బాలీవుడ్ న‌టుడు సంజయ్ ద‌త్ అధీరా అనే పాత్ర‌లో క‌నిపించ‌నుండ‌గా, ఆయ‌న పాత్ర హీరోకు త‌గ్గ రేంజ్‌లో ఉంటుంద‌ని నిర్మాత‌లు అంటున్నారు. ఇప్ప‌టికే అధీరా లుక్‌ని విడుద‌ల చేయ‌గా, ఇది వైబ్రేష‌న్స్ క‌లిగించింది. ర‌వీనా టాండ‌న్, రావు ర‌మేష్‌తో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు చిత్రంలో ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులు బ్రేక్ చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది.