క్రేజీ గాసిప్..’RRR’ మళ్ళీ వాయిదా? కొత్త డేట్ కూడా?

ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర ఎన్నో అంచనాలు నెలకొల్పుకొని ఉన్న భారీ మల్టీ స్టారర్ కం పాన్ ఇండియన్ సినిమా ట్రిపుల్ ఆర్(RRR). మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అలాగే ఎన్టీఆర్ లతో దిగ్గజ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. మరి కొన్ని రోజులు కితమే కొత్త డేట్ ని కూడా చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. అయితే అదిరే రికార్డులు, వాయిదాలు రాజమౌళి సినిమాలకు కొత్తేమి కాదు.

అలానే ఈ సినిమా కూడా పలుమార్లు వాయిదా పడుతూనే వస్తూ ఉంది. అలా ఇప్పుడు సినీ వర్గాల్లో లేటెస్ట్ గాసిప్ వైరల్ అవుతుంది. దాని లెక్కన ఈ సినిమా మళ్ళీ వాయిదా పడుతుందట. దాని ప్రకారం ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 7 నుంచి జనవరి 26 కి మారినట్టు తెలుస్తుంది. పలు సినిమాల రిలీజ్ డేట్స్ నిమిత్తం ఈ భారీ సినిమా అప్పటికి మారినట్టు వినికిడి. ఇక దీనిపై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.