Ram Charan Shankar Film : క్రేజీ బజ్ : రామ్ చరణ్ – శంకర్ భారీ సినిమా ఫస్ట్ లుక్ కి డేట్ ఫిక్స్ అయ్యిందా?

Ram Charan Shankar Film :మన టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తర్వాత పాన్ ఇండియా సినిమా దగ్గర అప్ కమింగ్ హీరోస్ లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కాస్త ముందు వరుసలో ఉన్నాడని చెప్పాలి. భారీ అంచనాలతో తాను నటించిన తాజా సినిమా ట్రిపుల్ ఆర్(RRR) రిలీజ్ కి రెడీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.

ఇక ఈ సినిమా తర్వాత ఎలాంటి సినిమాని టేకాఫ్ చేస్తాడా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో ఇంకో ఇండియా టాప్ దర్శకుడు శంకర్ తో ఒక బిగ్ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమా అనౌన్స్ చేసి ఇంకా హైప్ ఇచ్చాడు. మరి ఆల్రెడీ రెండు షెడ్యూల్స్ కంప్లీట్ చేసిన ఈ చిత్రం మళ్లీ కొత్త షూట్ కి సిద్ధం అవుతుండగా ఇప్పుడు ఒక క్రేజీ బజ్ వైరల్ అవుతుంది.

ఈ భారీ సినిమా నుంచి మేకర్స్ ఇప్పుడు ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చెయ్యడానికి సిద్ధం చేసారట. మరి దీన్ని వచ్చే మార్చ్ 27న రిలీజ్ చేయబోతున్నట్టుగా ఇప్పుడు టాక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది వరకే సినిమా నుంచి వచ్చిన కాన్సెప్ట్ పోస్టర్ కే సాలీడ్ రెస్పాన్స్ వచ్చింది.

ఇక ఈ ఫస్ట్ లుక్ అంటే మినిమం అంచనాలు పెట్టుకోవచ్చు. శంకర్ సినిమాలు అంటే ఎంత గ్రాండ్ గా ఉంటాయో తెలిసిందే. ఇక ఈ సినిమాకు ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ భారీ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీకాంత్, రవిబాబు, సునీల్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలానే నిర్మాత దిల్ రాజు తన బ్యానర్ నుంచి 50వ సినిమాగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మాణం వహిస్తున్నారు.