Sridevi: తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ శ్రీదేవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కోర్ట్ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. చిన్న వయసులోనే హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుంది. మొదటి సినిమాతోనే హీరోయిన్గా మంచి గుర్తింపును ఏర్పరచుకుంది శ్రీదేవి. కాగా టాలీవుడ్ హీరో నాని ప్రొడ్యూసర్ గా మారి నిర్మించిన కోర్ట్ సినిమాలో హీరోయిన్గా నటించి మెప్పించింది శ్రీదేవి. టీనేజ్ లవ్ స్టోరీతో పాటు ఫొక్సో చట్టం నేపథ్యంలో ఈ కథను తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను మెప్పించారు.
ఇక ఈ సినిమాలో ప్రియదర్శి, సాయి కుమార్ తో పాటు హర్ష్ రోషన్, కాకినాడ శ్రీదేవి కీలక పాత్రల్లో నటించి మెప్పించిన విషయం తెలిసిందే. ఈ సినిమా మంచి విజయం సాధించిన తర్వాత కాకినాడ శ్రీదేవికి విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. కోర్ట్ సినిమా తర్వాత శ్రీదేవికి కూడా క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి. ఈ చిన్నదాని వయసు ఇంకా టీనేజ్ కావడంతో తన వయసుకు తగ్గ పాత్రలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తుంది. ఇటీవలే తమిళ్ లో ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది శ్రీదేవి.
ఇటీవలే ఆ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. మరోవైపు ఈ ముద్దుగుమ్మకు తెలుగులో వరుసగా అవకాశాలు వస్తున్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది హీరోయిన్ శ్రీదేవి. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. నాకు చాలా సినిమా అవకాశాలు వస్తున్నాయి. తెలుగులో కూడా ఒకరు ఇద్దరు యంగ్ హీరోల సరసన నటించే అవకాశం వచ్చింది. లవ్ స్టోరీ కథల్లో నటించాలని చాలా కథలు వచ్చాయి. కానీ నాకు ఇప్పుడే అలాంటి సినిమాల్లో నటించలేదు. నేను ఇప్పుడే కెరీర్ మొదలు పెట్టాను. హీరోయిన్ అవ్వడం కోసమే నేని ఇండస్ట్రీలోకి వచ్చాను. కానీ నా వయసు తగ్గ పాత్రలు చేస్తాను. యాక్టింగ్ మీద పట్టు వచ్చాక అన్ని రకరాల పాత్రలు చేయాలని ఉంది. మంచి పాత్రలు చేసి పేరు తెచ్చుకోవాలని ఉంది అని చెప్పుకొచ్చింది శ్రీదేవి. ఇక ఈ చిన్నది కోర్ట్ సినిమాలో జాబిల్లి పాత్రలో తన నటనతో ఆకట్టుకుంది. ఇప్పుడు తమిళ్ సినిమాలో ఎలాంటి పాత్ర చేస్తుందో చూడాలి మరీ.
Sridevi: నేను ఇంకా చిన్నదాన్నే.. అలాంటి ఆఫర్స్ వచ్చాయి.. ఇప్పుడే అలాంటివి చేయను!
