ఆంధ్రప్రదేశ్‌ని కరోనా చుట్టేస్తుంది. రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకీ పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి. ఈ క్రమంలో గత 24 గంటల్లో ఏపీలో ఏకంగా 5,041 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా, కరోనా కారణంగా 56 మంది మృతి చెందారు. దీంతో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 49,650కి చేరుకుందని రాష్ట్ర ఆరోగ్యశాఖ తాజా బులెటిన్ ద్వారా తెలియజేసింది. ఇక ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 642కు చేరుకోగా, 22,890 మంది కరోనా నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ప్రస్తుతం ఏపీలో 26,118 కరోనా యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇక ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో కరోనా టెస్టులు ఎక్కువగా నిర్వహిస్తున్నారు. దీంతో కేసులు కూడా ఎక్కువగానే నమోదవుతున్నాయి.