Corona update in India: కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా డేటా ప్రకారం, భారతదేశంలో కొత్తగా 9,195 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయని తెలుస్తుంది. దీంతో ప్రస్తుతానికి 77,002 యాక్టివ్ కేసులు ఉండగా కొత్తగా నమోదైన కేసులతో కలిపి దేశంలో ఇప్పటివరకు 3,48,08,886 కేసులు బయటపడ్డాయి. నిన్న 7,347 మంది కరోనా నుండి కోలుకున్నారు. 302 మంది మరణించగా మొత్తం మరణాల సంఖ్య 4,80,592కు చేరింది. ఇప్పటివరకు దేశంలో 67,52,46,143 కరోనా నిర్థారణ పరీక్షలు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
ఇక ఓమిక్రాన్ కేసుల విషయానికొస్తే… కొత్తగా నమోదైన 128 కేసులతో కలిపి బుధవారం 781కి పెరిగింది. ఒమిక్రాన్ బాధితుల్లో 241 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు ఢిల్లీలో 238, మహారాష్ట్రలో 167, కేరళలో 65, గుజరాత్‌లో 73, రాజస్థాన్‌లో 46, తెలంగాణలో 62, తమిళనాడులో 34, కర్ణాటకలో 34, హర్యానాలో 12, పశ్చిమ బెంగాల్ లో 11, మధ్యప్రదేశ్ లో 9, ఒడిశా లో 8, ఆంధ్రప్రదేశ్ లో 6, ఉత్తరాఖండ్ లో 4, చండీఘర్ లో 3, జమ్మూ కాశ్మీర్ లో 3, యూపీలో 2, గోవాలో 1, హిమాచలప్రదేశ్ లో 1, లడఖ్ లో 1, మణిపూర్ లో 1 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
ఇక దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు ఓమిక్రాన్ వేరియంట్ వ్యాప్తిని నిరోధించడానికి కఠినమైన కోవిడ్ నిబంధనలను విధించడం ప్రారంభించాయి. ఢిల్లీలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం “ఎల్లో అలర్ట్” ప్రకటించారు. కొత్త ఆంక్షల ప్రకారం, అన్ని విద్యా సంస్థలు, సినిమా హాళ్లు మరియు జిమ్‌లు మూసివేయబడతాయి, వివాహాలు మరియు అంత్యక్రియల సమావేశాలకు 20 మందిని మాత్రమే పరిమితం చేశారు. అలానే మెట్రో రైళ్లు, బస్సులు మరియు రెస్టారెంట్లలో 50 శాతం సీటింగ్ కు అనుమతులిచ్చారు.
