తెలంగాణలో కరోనా వైరస్ కేసుల సంఖ్యయాభైవేలు దాటిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా 1640 కొత్త కరోనాకేసులు నమోదయ్యాయి. మరోవైపు కరోనా కారణంగా మరో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ప్రస్తుతం తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 52,466కు చేరుకుంది. ఇప్పటి వరకు తెలంగాణ వ్యాప్తంగా 3,37,771 శ్యాంపిళ్ళను పరీక్షించినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ పేర్కొంది.
ఇక తెలంగాణ వ్యాప్తంగా కరోనా కారణంగా ఇప్పటి వరకు 455 మంది మృతి చెందగా, 40,334 మంది కరోనా నుండి కోలుకుని ఆస్పత్రుల నుండి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ప్రస్తుతం తెలంగాణలో 11,677 మంది కరోనా పేషెంట్లు చికిత్స పొందుతున్నారు. ఇక కొత్తగా నమోదైన కేసుల్లో హైదరాబాద్లో 683 కరోనా కేసులు నమోదవగా, దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కరోనా కేసులు పెరుగుతుండడం ఆందోళణ కల్గిస్తోంది.