ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ వీరవిహారం చేస్తుంది. గత కొద్ది రోజులుగా ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు వేలల్లో నమోదవుతున్నాయి. ఇక గత 24 గంటల్లో 20,245 శాంపిళ్ళను పరీక్షించగా, 2,602 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యిందని, అలాగే కరోనా కారణంగా 42 మంది ప్రాణాలు కోల్పోయారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో ప్రస్తుతం ఏపీలో మొత్తం కరోనా కేసులు సంఖ్య 40,646కు చేరుకుంది. తూర్పుగోదావరిలో ఒక్కరోజులోనే పెద్ద ఎత్తున కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిని 24 గంటల్లో తూగోజీలో 634 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక మొత్తంగా చూసుకుంటే, రాష్ట్ర వ్యాప్తంగా 534 మంది కరోనా కారణంగా మృతి చెందగా, 20,298 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుండి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ప్రస్తుతం ఏపీలో 19,814 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.