తెలంగాణ మ‌ళ్ళీ పెరిగిన క‌రోనా కేసులు.. మ‌ర‌ణాలు అయితే..?

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 65 వేల‌కు చేరువ‌య్యింది. మరో తెలుగు రాష్ట్ర‌మైన ఏపీతో పోలిస్తే, తెలంగాణ‌లో న‌మోద‌వుతున్న‌ క‌రోనా కేసుల సంఖ్య త‌క్కువే అయినా, ప్ర‌తిరోజు వెయ్యి నుండి రెండు వేలు వ‌రకు కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. ఇక గ‌త 24 గంట‌ల్లో తెలంగాణ వ్యాప్తంగా ‌2,063 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ‌గా, క‌రోనా కార‌ణంగా 11 మంది మృతి చెందారు. దీంతో ప్ర‌స్తుతం తెలంగాణ‌లో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 64,786కు చేరుకుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక క‌రోనా సోకి ఇప్ప‌టి వ‌ర‌కు 530 మంది ప్రాణాలు కోల్పోగా, 11,359 మంది క‌రోనా నుండి కోలుకున్నారు. దీంతో ప్ర‌స్తుతం తెలంగాణ వ్యాప్తంగా 46, 502 యాక్టీవ్ క‌రోనా కేసులు ఉన్నాయి.