Crime News: ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన కానిస్టేబుల్.. మనస్తాపంతో యువతి ఆత్మహత్య..!

Crime News: గౌరవనీయమైన పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తూ ప్రజలను కాపాడాల్సిన పోలీసులే నేరాలకు ఇటీవల భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. పోలీస్ శాఖలో ఉద్యోగం చేస్తున్న యువకుడు పెళ్లి చేసుకోవడానికి కట్నం అడిగాడు. ప్రేమించిన వ్యక్తే కట్నం అడగడంతో మనస్తాపం చెందిన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది.

పోలీసులు తెలిపిన వివరాల మేరకు….. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ప్రాంతం కొమరారం లో నివసించే 22 సంవత్సరాల వయసు గల చీమ బిందు అనే యువతి చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో మేనమామ ఇంట్లో ఉంటుంది. బిందు గత నాలుగు సంవత్సరాలుగా తన సమీప బంధువైన యువకుడితో ప్రేమలో పడింది. ఆ యువకుడు పోలీస్ శాఖలో పని చేస్తున్నాడు. ప్రేమించడమే కాకుండా అతనితో సహజీవనం కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ఆ యువకుడి దగ్గర పెళ్లి ప్రస్తావన తీసుకురాగా తమ ఇంట్లో పెద్దలు పెళ్లికి నిరాకరిస్తారని, 10 లక్షల కట్నంగా ఇస్తేనే ఒప్పుకుంటారు అని చెప్పాడు. ఇదే విషయాన్ని బిందు తన మేనమామకు చెప్పింది.

దీంతో పోలవరం గ్రామంలో నివాసం ఉండే యువకుడు కుటుంబ సభ్యుల వద్దకు బిందు కుటుంబ సభ్యులు ఈ విషయం గురించి మాట్లాడడానికి వెళ్లారు. యువకుడి కుటుంబ సభ్యులు కూడా 10 లక్షల కట్నం ఇస్తేనే వివాహం జరుపుతామని చెప్పారు. బిందూదీ నిరుపేద కుటుంబం కావడంతో పది లక్షలు ఇచ్చే పరిస్థితిలో వారి కుటుంబ స్తోమత లేదు. ప్రేమించిన వాడిని వదులుకోలేక, 10 లక్షల కట్నం ఇవ్వలేక మనస్తాపం చెందిన బిందు ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మేనమామ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.