బీజేపీ కండువా కప్పుకోబుతున్న కాంగ్రెస్ తోపు లీడర్ … గ్రేటర్ ఎన్నికలలో బీజేపీకి తిరుగుండదుగా?

హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల వేళ తెలంగాణలో కాంగ్రెస్‌కు మరో భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ కాంగ్రెస్‌కు టాటా చెప్పనున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. అంతకుముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ ఎంపీ వివేక్ ఆయన్ను కలిసి బీజేపీలోకి ఆహ్వానించారు. హైదరాబాద్ మహేంద్రహిల్స్‌లోని సర్వే సత్యనారాయణ ఇంటికి వెళ్లి మరీ ఆయన్ను ఆహ్వానించడం విశేషం. దీంతో వారి అభ్యర్థనను సర్వే సత్యనారాయణ స్వాగతించారు.

congress leader sarve sathyanarayana all set to joins in bjp party
Sarve sathyanarayana

సమావేశం అనంతరం సర్వే సత్యనారాయణ విలేకరులతో మాట్లాడారు. త్వరలో బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. బీజేపీలో చేరాలని బండి సంజయ్, వివేక్ కోరారని చెప్పారు. ప్రొటోకాల్ ప్రకారమే బీజేపీలో చేరుతున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా తనతో పాటు చాలా మందిని బీజేపీలో చేర్పిస్తానని సర్వే సత్యనారాయణ స్పష్టం చేశారు.గ్రేటర్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు ఇది పెద్ద ఎదురుదెబ్బలాంటిదే. ఇప్పటికే దుబ్బాకలో ఓటమి పాలై దయనీయ స్థితిలో ఉన్న ఆపార్టీకి ఇలా సీనియర్లంతా మరో కండువా కప్పుకోవటం చాలా నష్టమని చెప్పుకోవాలి. ఈ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ ఓటమి పాలయ్యేలా కనిపిస్తుంది.