ఇప్పుడు టాలీవుడ్ నుంచి రిలీజ్ కి సిద్ధంగా ఉన్న చిత్రాల్లో నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా “అంటే సుందరానికి” కూడా ఒకటి. దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన ఈ సినిమాలో మలయాళ బ్యూటీ నజ్రియా హీరోయిన్ గా నటించగా తెలుగులో కూడా ఈమె ఫస్ట్ ఈ సినిమాతోనే పరిచయం కాబోతుంది.
అయితే ఈ సినిమాపై ఇప్పుడు మంచి అంచనాలు కొనసాగుతూ వస్తున్న నేపథ్యంలో ఈరోజే సినిమా సెన్సార్ కూడా కంప్లీట్ చేసుకుంది. సెన్సార్ నుంచి అయితే ఈ సినిమాకి క్లీన్ యూ సర్టిఫికెట్ వచ్చింది. అయితే గత కొన్ని రోజులు కితం ఈ సినిమా నిడివి పై పలు గాసిప్స్ వినిపించాయి.
ఇది ఎంటర్టైన్మెంట్ సినిమానే అయినా దాదాపు 3 గంటల సినిమాగా వచ్చింది అని తెలిసింది. కానీ అనూహ్యంగా ఇప్పుడు ఈ చిత్రం నిడివి పై క్లారిటీ వచ్చింది. ఆ గాసిప్ నిజం చేస్తూ ఈ సినిమా ఏకంగా 2 గంటల 56 నిమిషాలు వచ్చిందట. ఇలాంటి సినిమాలకు ఇది ఎక్కువే అని చెప్పాలి.
మంచి యాక్షన్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాలనే జనం ఈ మధ్య సరిగ్గా చూడట్లేదు అలాంటిది ఒక కామెడీ ఎంటర్టైనర్ కి ఇంత మొత్తంలో అంటే ఆలోచించాల్సిందే. ఒకవేళ ఫస్ట్ డే టాక్ ఏమన్నా తేడా వస్తే ఆడియెన్స్ దూరం అయ్యిపోతారు.
మరి ఈ సినిమాలో అంతేసేపు ఆడియెన్స్ ని కూర్చోబెట్టే మ్యాజిక్ ఏమన్నా ఉంటుందో లేదో తెలియాలి. ఇక ఈ సినిమాకి వివేక్ సాగర్ సంగీతం అందించగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. అలాగే ఈ జూన్ 10న ఈ చిత్రం మూడు భాషల్లో రిలీజ్ అవుతుంది.