Revanth Reddy: గత కొద్ది రోజుల నుంచి తెలంగాణ ప్రభుత్వం అల్లు అర్జున్ ని టార్గెట్ చేసిందా అంటే అవుననే అభిమానులు భావిస్తున్నారు. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా విడుదల సమయంలో అల్లు అర్జున్ తన కుటుంబ సభ్యులతో కలిసి సంధ్య థియేటర్ వద్దకు వచ్చి సినిమాని చూశారు. ఇలా డిసెంబర్ 4వ తేదీ అల్లు అర్జున్ సంధ్య థియేటర్ వద్దకు రావడంతో ఒక్కసారిగా అభిమానులు తనని చూడటం కోసం ఎగబడ్డారు దీంతో రేవతి అనే మహిళ మరణించగా తన కుమారుడు శ్రీ తేజ్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.
ఈ క్రమంలోనే రేవతి మరణించడంతో అల్లు అర్జున్ అక్కడికి అనుమతి లేకుండా రావటమే కారణం అంటూ ప్రభుత్వం ఈయనపై సీరియస్ అవ్వడమే కాకుండా తనని అరెస్టు కూడా చేసి జైలుకు పంపిన సంగతి తెలిసిందే. ఈ విధంగా అల్లు అర్జున్ అరెస్టు కావడంతో సీఎం రేవంత్ రెడ్డి తనని టార్గెట్ చేస్తూ అరెస్టు చేశారని ఈయన అరెస్టు విషయం కాస్త రాష్ట్ర రాజకీయాలలో తీవ్రదుమారం రేపింది.
ఇక ఈయనకు ఈ కేసు విషయంలో కోర్టు నుంచి పూర్తిగా విముక్తి లభించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలో ఉన్న విషయం మనకు తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా మరోసారి ఈయనకు అల్లు అర్జున్ అరెస్ట్ గురించి ప్రశ్న ఎదురయింది .దీంతో రేవంత్ రెడ్డి మరోసారి అల్లు అర్జున్ అరెస్ట్ గురించి మాట్లాడుతూ సంచలన విషయాలను వెల్లడించారు.
తొక్కిసలాట ఘటనకు అల్లు అర్జున్ నేరుగా బాధ్యుడు కాదు కదా అని ప్రశ్నించగా.. రెండు రోజుల ముందు అనుమతి కోసం వస్తే.. పోలీసులు అల్లు అర్జున్ థియేటర్ కి రావడానికి పోలీసులు అనుమతి తెలపలేదు. ఆయన ఆ సమయంలో థియేటర్ కి వస్తే అభిమానులను కంట్రోల్ చేయడం కష్టమవుతుందని భావించిన పోలీసులు ఆయనకు అనుమతి తెలుపలేదు. ఇలా అనుమతి లేకపోయినా అల్లు అర్జున్ ఆరోజు రోడ్ షో చేస్తూ థియేటర్ వద్దకు వచ్చారు.
ఇక అల్లు అర్జున్ రావడంతో పెద్ద ఎత్తున అభిమానులు ఏగబడటం ఒక అభిమాని మరణించడం జరిగింది. ఇలా ఒక అభిమాని మరణించడం అనేది ఆయన చేతుల్లో లేకపోవచ్చు. ఒక మహిళ చనిపోతే, 10-12 రోజులు బాధిత కుటుంబాన్ని పట్టించుకోలేదు. అందుకే చట్టం తన పని తాను చేసుకుని పోయింది అంటూ ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మరోసారి అల్లు అర్జున్ అరెస్ట్ గురించి చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.