Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై స్పందించారు. దేశ రాజధాని అయిన ఢిల్లీలో ఎన్నికలు జరగగా అక్కడ కూడా బిజెపి హవా చూపిస్తూ అధికార పీఠాన్ని దక్కించుకుంది. 70 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగకగా దాదాపు 47 స్థానాలలో బిజెపి విజయం సాధించగా కేవలం 23 స్థానాలలో మాత్రమే ఆప్ పార్టీ విజయం సాధించింది.
ఇక ఈ ఎన్నికల ఫలితాలలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అసలు ఖాతా కూడా తెరవలేదు అని చెప్పాలి. ఇలా ఒక్క సీటు కూడా కాంగ్రెస్ కి రాకపోవడంతో ఎంతోమంది కాంగ్రెస్ పై విమర్శలు చేస్తున్నారు. ఇలా ఢిల్లీలో కాంగ్రెస్ కి గుండు సున్నా రావడంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ…
కేంద్రాన్ని ఎదుర్కోవడానికి ఇండియా కూటమి…. కానీ కేజ్రీవాల్ కూటమిని డిస్ట్రబ్ చేశారని ఆగ్రహించారు.
ఢిల్లీలో ప్రజలు పొజిషన్.. అపోజిషన్ లాగే చూశారన్నారు. అందుకే బీజేపీ అప్ పార్టీల మధ్య పోటీ జరిగిందని వివరించారు. ఢిల్లీలో కేజ్రీ వాల్, యాంటీ కేజ్రీ వాల్ అనే విధంగా ఎన్నికలు జరిగాయని తెలిపారు అయితే ఈయనకు వ్యతిరేకంగా ఉన్న వారందరూ కూడా బిజెపికి ఓట్లు వేసి గెలిపించారని రేవంత్ రెడ్డి తెలిపారు.
తెలంగాణలో కూడా అలాగే జరిగిందని వివరించారు. కేంద్రం మాకు సహకరించడం లేదని ఆగ్రహించారు. ఇతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు కేంద్రం సహకరించడం లేదు.. దక్షిణాది రాష్ట్రాల మీద ఎందుకు వివక్ష అంటూ అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని నిలదీశారు దక్షిణాది రాష్ట్రాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చాలా ప్రమాదకరమని ఈయన తెలిపారు. ఈ విషయంలో దక్షిణాది రాష్ట్ర ప్రజలు ఏకం అవ్వాల్సిన సమయం వచ్చిందని ఈయన తెలియజేశారు.