Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ఢిల్లీ పర్యటన వెళ్లారు అనంతరం కాంగ్రెస్ సీనియర్ నాయకులు జానారెడ్డి ఇంటికి వెళ్లి కూడా ఆయనతో భేటీ అవడం జరిగింది. ఇలా త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉన్న నేపథ్యంలో ఈయన జానారెడ్డి ఇంటికి వెళ్లి తనని కలవడంతో అలా కలవడానికి గల కారణమేంటి అనే విషయంపై పెద్ద ఎత్తున చర్చలు మొదలయ్యాయి. అయితే రేవంత్ రెడ్డి జానారెడ్డిని కలవడం వెనుక పెద్ద స్కెచ్ ఉందని తెలుస్తుంది.
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటానికి సొంత పార్టీ నేతలే జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే పార్టీ నేతల నుంచి తనకు ఏమాత్రం మద్దతు లభించడం లేదు అంటూ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అందరిని ఆశ్చర్యానికి గురి చేశాయి. ఇలాంటి తరుణంలోనే తన ముఖ్యమంత్రి పదవికి అలాగే పార్టీకి ఎలాంటి డోకా ఉడకూడదు అంటే పార్టీకి పెద్ద దిక్కు అవసరం అని రేవంత్ రెడ్డి భావించినారని తెలుస్తోంది.
ఇందులో భాగంగానే జానారెడ్డిని కూడా ఈయన కలవడమే కాకుండా ఆయనని కాంగ్రెస్ పార్టీ ముఖ్య సలహాదారుడిగా నియమించబోతున్నారంటూ కూడా వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి త్వరలోనే అధికారికంగా ప్రకటించబోతున్నారంటూ వార్తలు వినపడుతున్నాయి. నిజానికి కొంతమంది సీనియర్ కాంగ్రెస్ నేతలతో రేవంత్ రెడ్డికి కాస్త గ్యాప్ వచ్చింది కానీ జానారెడ్డితో మాత్రం ముందు నుంచి ఒకే విధంగా వ్యవహరిస్తున్నారు అలాగే పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పేరును నియామకం చేయటంలో జానారెడ్డి కీలక పాత్ర పోషించారు.
ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీలో తనకు కొంతమంది మంత్రుల నుంచి కూడా మద్దతు లభించకపోవుతున్న నేపథ్యంలో పార్టీకి పెద్ద అవసరమని భావించిన రేవంత్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఇక ఈ విషయాన్ని త్వరలోనే ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది.
