ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో టాలీవుడ్ పెద్దలు మంగళవారం విజయవాడ ముఖ్యమంత్రి కార్యాలయంలో సమావేశమైన సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, సురేష్ బాబు, సి. కళ్యాణ్, దిల్ రాజు, రాజమౌళి తదితరులు ఉన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ తర్వాత ఏపీ సీఎం సమావేశంలో ఎలాంటి అంశాలపై చర్చ జరుగుతుందని ఆసక్తి నెలకొంది. ఈ సమావేశానికి మెగాస్టార్ చిరంజీవి లీడ్ తీసుకున్నారు. పరిశ్రమ తరుపు నుంచి ఆయనే ముందుండి మాట్లాడారు. సీఎం చిరు సహా మిగతా అందర్నీ ప్రత్యేకంగా ఆహ్వానించారు. తాజాగా ఆ వివరాలు బయటకు వచ్చాయి. ఇక ఈభేటీలో చర్చకొచ్చిన అంశాలివే.
ఈనెల 15 తర్వాత నుంచి షూటింగ్ లు చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. రాష్ర్టంలో తెలుగు పరిశ్రమ రాణించడానికి వెసులు బాటు కల్పిస్తూ ప్రత్యేక జీవోను విడుదల చేసింది. లాక్ డౌన్ కారణంగా థియేటర్లు మూతపడ్డాయి. పున ప్రారంభం కాని పరిస్థితుల్లో ఉన్నాయి. ఈ సమయంలో థియేటర్ల మినిమం పవర్ టారిఫ్ లను రద్దు చేయలని ప్రభుత్వాన్ని కోరడం. అందుకు జగన్ అంగీకారం తెలిపారు. 2019-20 ఏడాదికి గాను నంది అవార్డులు ప్రదానం చేయడానికి ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చారు.అలాగే టికెటింగ్ లో పాదర్శకత అధికారులతో చర్చలు జరిపి నిర్ణయం తీసుకుంటామన్నారు.
అలాగే వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో చిత్ర పరిశ్రమ అభివృద్దికి 300 ఎకరాలు కేటాయించారు. దాన్ని పున పరిశీలిస్తామని జగన్ తెలిపారు. ఏపీలో సినిమాలు నిర్మించాలి. అవుట్ డోర్ యూనిట్లు పెట్టాలనుకున్న వాళ్లకు అది ఎంతగానో ఉపయోగప డుతుందని భేటీలో చర్చకొచ్చింది. టాలీవుడ్ పెద్దలు చెప్పిన అన్ని సమస్యలను జగన్ విని సానుకూలంగా స్పందించినట్లు చిరంజీవి తెలిపారు. ఏపీలో సినిమా అభివృద్దికి సీఎంగారు ఎంతో ఉత్సాహం చూపిస్తున్నారని, మనం అడగాలే గానీ..ఆయన ఏరకంగానైనా సహాయం చేయడానికి ముందుకొస్తున్నారని, ఇది పరిశ్రమ అభివృద్దికి ఎంతో దోహద పడే అంశమని చిరంజీవి తెలిపారు. ఇక విశాఖ ఎగ్జిక్యుటివ్ క్యాపిటల్ అవ్వడం…సినిమా పరిశ్రమ అభివృద్ది చెదడం చూస్తుంటే విశాఖ దేశంలో ఉన్న మహానగరాలను మించి పోవడం ఖాయమనిపిస్తోంది.