Home News వేదాళం రీమేక్‌ను చిరంజీవి ప‌క్క‌న పెట్టాడా.. నిర్మాతలు ఏమంటున్నారు!

వేదాళం రీమేక్‌ను చిరంజీవి ప‌క్క‌న పెట్టాడా.. నిర్మాతలు ఏమంటున్నారు!

తొమ్మిదేళ్ళ త‌ర్వాత ఖైదీ నెం 150 చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన చిరంజీవి ప్ర‌స్తుతం వ‌రుస సినిమాలు చేస్తున్నారు. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఆచార్య చేస్తున్న మెగాస్టార్ ఇది పూర్తి కాక ముందే మరో రెండు సినిమాలు కూడా కన్ఫర్మ్ చేసాడు. అందులో లూసీఫర్ రీమేక్ ముహూర్తం కూడా పెట్టేసాడు. ఈ చిత్రాన్ని మోహన్ రాజా తెరకెక్కిస్తున్నాడు. ఫిబ్ర‌వ‌రిలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ల‌నుంది. ఇక లూసీఫర్ రీమేక్ తో పాటు మరో రీమేక్ సినిమాకు కూడా ఓకే చెప్పాడు మెగాస్టార్. అదే వేదాళం రీమేక్. మెహర్ రమేష్ దర్శకత్వంలో ఈ సినిమా ఉంటుందని చెప్పిన చిరు ఈ సినిమాను ప‌క్క‌న పెట్టేశాడ‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతుంది.

Chiru 5 | Telugu Rajyam

వేదాళం సినిమాను ముందు పవన్‌తో రీమేక్ చేయాలనుకుని.. ఏఎం రత్నం ముహూర్తం కూడా పెట్టాడు. విజయ్, మోహన్ లాల్ తో జిల్లా లాంటి మల్టీస్టారర్ చేసిన నీసన్ దర్శకత్వంలో ఈ రీమేక్ చేయాలనుకున్నారు కానీ కుదర్లేదు. ఆ తర్వాత నాలుగేళ్లకు చిరంజీవి చేతికి వచ్చింది వేదాళం రీమేక్. కానీ వేదాళం రీమేక్ పై ఎందుకో చిరు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇందులో మాస్ ఆడియన్స్ కు కావాల్సిన అంశాలన్నీ ఉన్నాయి.. కానీ మాస్ తో పాటు డాన్సులు, ఫైట్ సీక్వెన్సులు కూడా భారీగానే ఉన్నాయి. ఇప్పుడున్న వయసు ప్రకారం డాన్సులతో పాటు ఫైట్ సీక్వెన్సులు కూడా అంతగా చేయలేనని చిరు భావిస్తున్నట్లు తెలుస్తుంది. అందుకే లూసీఫర్ లాంటి స్టోరీ డ్రివెన్ సినిమాల వైపు చిరు మనసు మళ్ళుతుంది. 65 ఏళ్ళ మెగాస్టార్ ఇప్పుడు అలాంటి యాక్షన్ సీక్వెన్సులు చేయాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. అందుకే వేదాళం రీమేక్ ను పక్కనబెట్టాలని చిరు భావిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.

ఈ వార్త‌ల‌పై తాజాగా నిర్మాత‌లు స్పందించారు. వేదాళం సినిమా రీమేక్ ఆగిపోలేదు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడక్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. ఇటీవ‌లే ఈ సినిమా ప‌నుల కోసం కోల్‌క‌తాకు కూడా వెళ్ళాం అని నిర్మాత‌లు అంటున్నారు. ఈ సినిమాను తన రెమ్యునరేషన్ కాకుండా 25 కోట్లలోపే పూర్తి చేయాలని అనుకున్నాడు చిరు. మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు చిరంజీవి ఇచ్చిన టాస్కును పూర్తి చేయడానికి తనవంతు ప్రయత్నం చేస్తున్నాడు మెహర్ రమేష్. ఏడేళ్ళ తర్వాత వచ్చిన ఆఫర్ కావడంతో ఎన్ని కండీషన్స్ పెట్టినా కూడా నో చెప్పలేకపోతున్నాడు మెహర్. మరి మెగాస్టార్ లాంటి హీరోతో పాతిక కోట్లతో సినిమాను ఎలా పూర్తి చేస్తాడో చూడాలి. 

- Advertisement -

Related Posts

దేవినేని అవినాష్‌కు పెద్ద బాధ్యతే అప్పజెప్పిన సీఎం జగన్… నిరూపించుకుంటే ఇక దశ మారినట్టే ?

ఏపీలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలపై రాజకీయ పార్టీలు పూర్తి స్థాయిలో దృష్టి సారించాయి. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల తర్వాత పార్టీ గుర్తుతో జరగబోతున్న తొలి ఎన్నికలు కావడంతో ఏపీలోని ప్రధాన రాజకీయ...

సైబర్ నేరగాళ్ల బారిన పడ్డ “భీష్మ” డైరెక్టర్ !

టెక్నాలజీ ఎంత వేగంగా పెరుగుతూ పోతోందో అంతే వేగంగా సైబర్ నేరగాళ్ల అక్రమాలూ పెరిగిపోతున్నాయి. సామాన్యులనే కాకుండా, ఈ సైబర్ నేరగాళ్లు ప్రముఖుల్ని వదలడం లేదు. తాజాగా నితిన్‌, రష్మిక మందానా జంటగా...

‘దృశ్యం 2’ షూటింగ్ మొదలెట్టిన వెంకటేశ్ !

గతంలో వచ్చిన 'దృశ్యం' సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఓ హత్య విషయంలో హీరో ఇంటిల్లిపాదీ ఒకే మాటపై నిలబడడం.. పోలీసులు ఎంతగా విచారణ చేసినా నిజం కక్కకపోవడం.. అదంతా ఓ కొత్త...

Latest News